ఎల్లలు దాటిన ఇండో-జర్మన్‌ ప్రేమ కథ

3 Jun, 2021 12:58 IST|Sakshi

ప్రేమకు హద్దులుండవు. ప్రేమ అనేది ఓ అద్భుతమైన భావన. ప్రేమ గురించి ఎంతో మంది ఎన్నో విషయాలను చెబుతుంటారు. ఇక సమయ పరీక్షను తట్టుకుని నిలబడిన ఎన్నో ప్రేమ కథలు సోషల్‌ మీడియాలో నెటిజన్‌ల హృదయాలను గెలుచుకుంటూనే ఉంటాయి. అలాంటిదే ఈ ఇండో- జర్మన్‌ ప్రేమ కథ. ప్రేమకు కులం, మతం, ప్రాంతం హద్దులు కావని మరోసారి నిరూపితమైంది. దుబాయ్‌లో మొదలైన వారి ప్రేమ ఖండాంతరాలను దాటి ఇండియాకు చేరింది. 

“నా పేరు జూలీ.. జర్మన్‌ని. ఇతడు అర్జున్..భారతీయుడు. మేము ఇద్దరం దుబాయ్‌లో కలుసుకున్నాం.. అక్కడే ప్రేమలో పడ్డాం! కానీ కొన్ని వారాల తరువాత, నేను తిరిగి నా దేశానికి వెళ్లవలసి వచ్చింది. దీంతో మా మధ్య దూరం ఏర్పడింది. ఇక అర్జున్‌ కూడా ఇండియాకు చేరుకున్నాడు. దీంతో అర్జున్‌ కోసం నేను ఇండియాకు రావాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడికి వచ్చి అతని కుటుంబాన్ని కలిశాను. అంతేకాకుండా అర్జున్‌ కుటుంబంతో నా మొట్టమొదటి హోలీని కూడా జరుపుకున్నాను! ఇక్కడికి వచ్చాక నేను భారతదేశంతో కూడా ప్రేమలో పడ్డాను. అంతకంటే ఎక్కువగా అర్జున్‌తో.. ఇక్కడ గడిపిన ప్రతి క్షణం నాకు అద్భుతం అనిపించింది. ఒక సంవత్సరం తరువాత అర్జున్‌ తాజ్ మహల్ ముందు తన ప్రేమను వ్యక్తపరిచాడు. మేము త్వరలో వివాహం చేసుకోబోతున్నాం! ప్రేమలో మునితేలుతున్నాం!’’ అంటూ జర్మనీకి చెందిన జూలీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.

ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్‌ల హృదయాలను గెలుచుకుంటూ.. తెగ వైరల్‌ అవుతోంది. కాగా దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. "ప్రేమ ఒకరినొకరు కనుగొంటుంది." అంటూ కామెంట్‌ చేశారు. ఇక మరో నెటిజన్‌ “ఇది చాలా స్వచ్ఛమైన ప్రేమ.” అంటూ రాసుకొచ్చారు. ఇక జూలీ కూడా ఈ పోస్ట్‌లపై స్పందిస్తూ, “యార్ హమారా లవ్‌ స్టోరి (మా ప్రేమకథ). మీ ప్రేమకు చాలా ధన్యవాదాలు’’. అంటూ స్పందించారు.
 

A post shared by Humans of Bombay (@officialhumansofbombay)


(చదవండి: వైరల్‌: అమ్మో ఏమి సాహసం..చూస్తే మతి పోవాల్సిందే!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు