Jeff Bezos: అభినందనలు...మేమూ ఎదురు చూస్తున్నాం!

12 Jul, 2021 10:37 IST|Sakshi

మేమూ  ఈ క్షణంకోసం ఎదురుచూస్తున్నాం: జెఫ్‌ బెజోస్‌

తొలిసారి రోదసిలోకి అడుగుపెట్టిన బిలియనీర్‌  రిచర్డ్‌ బ్రాన్సన్‌

అంతరిక్షంలోకి అడిగిడిన తొలి తెలుగు యువతిగా బండ్ల శిరీష చరిత్ర

సాక్షి, న్యూఢిల్లీ: బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్  చారిత్రక రోదసీ యాత్ర విజయవంతంపై మరో బిలియనీర్‌, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్  స్పందించారు. రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫైట్‌లో అంతరిక్షంలోకి అడిగిడిన సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. నింగికి ఎగిసే క్షణాలకోసంఎదురు చూస్తున్నాం.. ఆ క్లబ్‌లోకి  చేరడానికి తమకు ఉత్సాహంగా ఉందంటూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ పెట్టారు. 

మరోవైపు అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న బెజోస్‌ కల త్వరలోనే  నెరవేరబోతోంది.  బెజోస్‌స్ కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ ఒరిజన్ రూపొందించిన తయారు చేసిన న్యూ షెపర్డ్‌ రాకెట్‌లో సోదరులిద్దరూ రోదసీలోకి అడుగుపెట్టనున్నారు. జెఫ్ బెజెస్, అతడి సోదరుడు మార్క్ బెజోస్ సహా వ్యోమగాములతో మరికొద్ది రోజుల్లో ( 2021, జులై 20వ తేదీ) న్యూ షెపర్డ్‌  రోదసీలోకి టేకాఫ్ తీసుకోనుంది.

కాగా అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవసహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22లో రోదసిలోకి పయనమవుతున్న సందర్భంగా కూడా ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ సంఘటన తనకు ఒక జీవిత అనుభవాన్ని మిగిల్చిందని, ఏదో మాయాజాలంలా అనిపించిందంటూ బ్రాన్సన్‌ సంతోషం వ్యక్తం చేశారు.  అంతరిక్షం నుంచి భూమిని చూస్తున్న అనుభూతి అద్బుతంగా ఉందని బ్రాన్సన్‌ పేర్కొన్నారు. ఇంత అద్భుతమైన స్పేస్‌పోర్ట్‌ను సృష్టించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. తమని ఇంత దూరం తీసుకురావడానికి చేసిన కృషికి బ్రాన్సన్‌  ధన‍్యవాదాలు తెలిపారు.  ఈ  సందర్భంగా చరిత్ర సృష్టించిన శిరీషను బ్రాన్సన్ తన భుజాలపై ఎత్తుకున్న ఫోటోగా  వైరల్‌గా మారింది. 

A post shared by Jeff Bezos (@jeffbezos)

మరిన్ని వార్తలు