భారతీయులు ఉండని దేశాలు ఏవి?

8 Oct, 2023 11:10 IST|Sakshi

ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో భారతీయులు స్థిరపడుతున్నారు. అయితే పాకిస్తాన్‌లో భారతీయులు స్థిరపడటానికి ఇష్టపడటం లేదు. ఇలా ఒక్క పాకిస్తాన్‌లోనే కాదు యూరప్‌లో కూడా భారతీయులు నివసించని దేశాలు అనేకం ఉన్నాయని తెలిస్తే  ఎవరైనా ఆశ్చర్యపోతారు. 

భారతదేశీయులు నివసించని ప్రపంచంలోని కొన్ని దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో వేలాది మంది భారతీయులు స్థిరపడ్డారు. అయితే కొన్ని దేశాల్లో ఒక్క భారతీయుడు కూడా  కనిపించడు. ప్రపంచంలోని దాదాపు 195 దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. కానీ భారతీయులు నివసించని దేశాలు పాకిస్తాన్‌తో సహా చాలా ఉన్నాయి.

వాటికన్ సిటీ
యూరోపియన్ దేశం వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. కేవలం 0.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. అక్కడ నివసించే ప్రజలు రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు. ఈ దేశంలో జనాభా కూడా చాలా తక్కువ. ఈ దేశంలో ఒక్క భారతీయుడు కూడా నివసించడం లేదు. అయితే దీనికి భిన్నంగా భారతదేశంలో రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరించే క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

శాన్ మారినో
శాన్ మారినో కూడా ఐరోపాలోని ఒక రిపబ్లిక్ దేశం. ఇక్కడ మొత్తం జనాభా 3 లక్షల 35 వేల 620. ఈ దేశ జనాభాలో ఒక్క భారతీయుడు కూడా కనిపించడు. అయితే ఈ దేశంలో భారతీయ టూరిస్టులు కనిపిస్తారు.

బల్గేరియా
బల్గేరియా ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. ఇది ప్రకృతి అందాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 2019 జనాభా లెక్కల ప్రకారం బల్గేరియా మొత్తం జనాభా 6,951,482. ఇక్కడ నివసించే అధికశాతం జనాభా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తుంది. ఈ దేశంలో భారతీయులు ఎవరూ నివసించరు. అయినా ఇక్కడ భారతీయ దౌత్యవేత్తలు కనిపిస్తారు.

తువాలు
తువాలు ఓషియానియా ఖండంలోని ఒక ద్వీపంలో ఉన్న దేశం. తువాలును ఎల్లిస్ దీవులు అని కూడా అంటారు. ఇది ఓషియానియాలో ఉంది. ఇది ఆస్ట్రేలియాకు ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఈ దేశ జనాభా దాదాపు 10 వేలు. ఈ ద్వీపంలో కేవలం 8 కిలోమీటర్ల పొడవైన రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ భారతీయులెవరూ నివసించరు. ఈ దేశానికి 1978లో స్వాతంత్ర్యం వచ్చింది.

పాకిస్తాన్
భారతీయులు నివసించని దేశాల జాబితాలో మన పొరుగు దేశం పాకిస్తాన్ కూడా  ఉంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారతీయులెవరూ ఇక్కడ నివసించడం లేదు. పాకిస్తాన్‌లో భారత దౌత్యవేత్తలు, ఖైదీలు తప్ప మన దేశానికి చెందినవారెవరూ కనిపించరు.
ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు?

మరిన్ని వార్తలు