ఆర్టిస్ట్‌ అరెస్ట్‌: పోలీసులు చెప్పిన కారణం వింటే షాక్‌..

14 Jun, 2021 16:15 IST|Sakshi
పాకిస్తాన్‌ లాహోర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన ఆర్టిస్ట్‌ అబుజర్‌ మధు

పాకిస్తాన్‌లో చోటు చేసుకున్న సంఘటన

జుట్టు పెంచుకున్నందుకు అర్టెస్ట్‌ చేశామన్న పోలీసులు

ఇస్లామాబాద్‌: అప్పుడప్పుడు పోలీసులు చేసే పనులు చూస్తే.. ఆశ్చర్యం, అసహనం వంటి ఫీలింగ్స్‌ అన్ని ఒకేసారి వ్యక్తం అవుతాయి. ఎందుకంటే వింత వింత కారణాలు చెప్పి సామాన్యులను అరెస్ట్‌ చేసి ఇబ్బందులకు గురి చేస్తుంటారు పోలీసులు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి పాకిస్తాన్‌లో వెలుగు చూసింది. తెల్లవారుజామున రోడ్డు మీద రిక్షా కోసం వెయిట్‌ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక​ వారు చెప్పిన కారణం వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. సదరు వ్యక్తి జుట్టు పొడవుగా పెంచుకున్నందుకు అరెస్ట్‌ చేశామన్నారు పోలీసులు. ఈ సంఘటనపై నెటిజనులు ఆగ్రహం వ్యక్త చేస్తునారు. ఆ వివరాలు.. 

పాకిస్తాన్‌కు చెందిన ఆర్టిస్ట్‌, టీచర్‌, ప్రదర్శనకారుడైన అబుజర్‌ మధు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కల్మా చాక్‌ ప్రాంతంలో రిక్షా ఎదురు చూస్తున్నాడు. పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అబుజర్‌ని గమనించి అతడి వద్దకు వచ్చి వివరాలు ఆరా తీశారు. ఈ సమయంలో ఇక్కడ ఎందుకున్నావని ప్రశ్నించారు. ఆ తర్వాత అతడి ఐడీ కార్డ్‌ చూపించమని కోరారు. అబుజర్‌ తన ఐడెంటిటీ కార్డ్‌ పోలీసులుకు చూపించాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని వ్యాన్‌లో ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా అబుజర్‌ జైలులోనే గడిపాడు. తనను ఎందుకు అరెస్ట్‌ చేశారని పోలీసులను ప్రశ్నించగా.. అతడు జుట్టు పెద్దగా పెంచుకున్నాడని.. అందుకే అరెస్ట్‌ చేశామని తెలిపారు పోలీసులు. వారు చెప్పిన సమాధానం విన్న అబుజర్‌కు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు.

ఈ సంఘటన గురించి అబుజర్‌ స్నేహితురాలు, పిల్లల హక్కుల న్యాయవాది నటాషా జావేద్‌ ట్వీట్‌ చేయడంతో దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌ పోలీసులు ఇలా ప్రవర్తించడం కొత్తేం కాదని.. గతంలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలో అబుజర్‌ మాట్లాడుతూ.. ‘నేను ఐడీ కార్డ్‌ చూపించినప్పటికి పోలీసులు నమ్మలేదు. నన్ను పూర్తిగా చెక్‌ చేశారు. ఇక రాత్రంతా జైలులోనే ఉంచారు. నాలాగే జుట్టు పెంచుకుని కార్లలో తిరిగే వారిని పోలీసులు అరెస్ట్‌ చేస్తారా’ అని ప్రశ్నించాడు. 

ఈ సంఘటనపై నెటిజనులు ఆగ్రహం​ వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు దీనిపై స్పందించారు. ‘‘అబుజర్‌ వేషధారణ కాస్త అనుమానాస్పాదంగా ఉంది. అతడు తన పొడవాటి జుట్టును ముడి పెట్టుకుని.. చేతికి ఓ కంకణం ధరించి ఉన్నాడు. పైగా తెల్లవారుజామున ఇలా రోడ్డు మీద ఉండటంతో అనుమానం వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లాం’’ అని తెలిపారు. 

చదవండి: 
భారత్‌పై మరోసారి విషం కక్కిన పాక్‌.. కారణం తెలిస్తే షాక్‌
కోసి కుట్లేయడమే కదా అనుకున్నాడు.. మహిళ మృతి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు