ట్రంప్‌ నిజంగా మూర్ఖుడు.. అబద్దాల కోరు

23 Aug, 2020 11:08 IST|Sakshi
సోదరి మరియన్నే బారీ ట్రంప్‌తో డొనాల్డ్‌ ట్రంప్‌(ఫైల్‌ ఫోటో)

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిజంగా మూర్ఖుడు, అబద్దాల కోరు అంటూ ట్రంప్‌ సోదరి మరియన్నే ట్రంప్ బారీ ఆరోపించారు. అతను ఎవరిని అంత త్వరగా నమ్మడని.. తన సిద్దాంతాల కోసం ఎంతదూరమైనా వెళ్తాడంటూ ఆమె పేర్కొన్నారు. మరియన్నే చేసిన వ్యాఖ్యలు సీక్రెట్‌గా రికార్డ్‌ చేయబడ్డాయి.. ఇవన్నీ ట్రంప్‌ మేనకోడలు మేరీ ట్రంప్‌ రాసిన టాక్సిక్‌ ఫ్యామిలీలో ప్రచురించబడ్డాయి. ఇమ్మిగ్రేషన్‌ విధానంపై ట్రంప్‌ వైఖరిని తప్పుబడుతూ.. తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించడాన్నిమరియన్నే ట్రంప్ బారీ ఎండగట్టారు. (అవసరమైతే చైనాతో అన్నీ బంద్: ట్రంప్‌)

తన సిద్దాంతాల కోసం ఎవరిని లెక్కచేయడని.. అతను మాట్లాడే ప్రతి వ్యాఖ్యం అబద్ధమేనని.. ట్వీట్లు కూడా అదే విధంగా ఉంటాయన్నారు. అదే విధంగా ట్రంప్‌ వైఖరిని ప్రశ్నిస్తూ..  ట్రంప్‌ మేనకోడలు మేరీ ట్రంప్‌ రాసిన టాక్సిక్‌  ఫ్యామిలీ పబ్లికేషన్‌ను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత వారం మరణించిన అధ్యక్షుడి తమ్ముడు రాబర్ట్ ట్రంప్‌ మేరీ రాసిన పుస్తక ప్రచురణను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లారు. మేరీ తన తాత ఎస్టేట్‌లో స్థిరపడిన తరువాత 2001లో సంతకం చేసిన బహిర్గతం కాని ఒప్పందాన్ని ఆమె ఉల్లంఘిస్తున్నారని వాదించారు. కానీ రాబర్ట్‌ చేసిన వ్యాఖ్యలు కోర్టులో నిరూపితం కాలేదన్నారు. అంతేకాదు.. ఇప్పటివరకు 9లక్షల 50వేల కాఫీలు అమ్ముడయ్యాయని.. కానీ వైట్‌ హౌస్‌ మాత్రం అది ఒక అబద్దాల పుస్తకం అంటూ తప్పడు ప్రచారం చేశారన్నారు.

ఇది ట్రంప్‌ మూర్కత్వాన్ని చూపిస్తుందని.. తనకు అడ్డు వస్తే ఎంతదూరమైన వెళ్లడానికి వెనుకాడడని మేరీకి తాను చెప్పినట్లు బారీ వివరించారు. ట్రంప్‌ యునివర్సీటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో ప్రవేశం పొందడానికి వేరొకరితో పరీక్ష రాయించాడని.. ఇంకా ఆ వ్యక్తి పేరు నాకు గుర్తుంది అంటూ తెలిపారు. అయితే ట్రంప్‌ సోదరి వ్యాఖ్యలపై వైట్‌హౌస్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే రిపబ్లికన్‌ పార్టీ స్పందిస్తూ..  రానున్న ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించాలనే ప్రయత్నంలోనే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని  పేర్కొంది.   

మరిన్ని వార్తలు