బ్రిటన్‌ హోం మంత్రి బ్రేవర్మన్‌ రాజీనామా

20 Oct, 2022 04:46 IST|Sakshi

లండన్‌: భారత సంతతికి చెందిన బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ రాజీనామా చేశారు. లండన్‌లోని ఆమె కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని బుధవారం ధ్రువీకరించాయి. గోవా మూలాలున్న తండ్రి–తమిళనాడు మూలాలున్న తల్లికి జన్మించిన బ్రేవర్మన్‌ 43 రోజుల క్రితమే యూకే హోం సెక్రెటరీగా నియమితులయ్యారు.

యూకే ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారిపోతుండడంతో ప్రధాని లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. బ్రవెర్మన్‌ బుధవారం ఉదయం లిజ్‌ ట్రస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం రాజీనామా సమర్పించినట్లు తెలిసింది. ట్రస్‌ విధానాలతో బ్రవెర్మన్‌ విభేదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ రాజీనామా పరిణామంతో ట్రస్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.  

మరిన్ని వార్తలు