వృద్దురాలి వేషంలో వచ్చి బ్యాంకును కొల్లగొట్టి... దర్జాగా కారులో పరార్‌

21 Jul, 2022 09:41 IST|Sakshi

ఇటీవల కాలంలో దొంగలు చాలా విచిత్రంగా దొంగతనాలు చేస్తున్నారు. అందినట్టే అంది చిక్కుకుండా చాలా తేలిగ్గా తప్పించుకుంటున్నారు. దొంగలు కూడా మనతోపాటే కలిసిపోయి చాలా తెలివిగా బురిడి కొట్టించి మరీ పరారవుతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి చాలా తెలివిగా బ్యాంకు సొత్తును దొచుకుని పరారయ్యడు.

వివరాల్లోకెళ్తే...అమెరికాలోని జార్జియాలో ఒక వ్యక్తి బ్యాంకు వద్దకు వృద్దురాలి వేషంలో వచ్చాడు. ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది వద్దకు వెళ్లి తుపాకిని చూపి...బెదిరించి డబ్బు దోచుకున్నాడు. ఆ తదనంతరం బయటకు వచ్చి నెంబర్‌ ప్లేట్‌ లేని తెల్లటి ఎస్‌యూవీ కారులో దర్జాగా వెళ్లిపోయాడు. వాస్తవానికి బ్యాంకు పరిసర ప్రాంతంలోని వాళ్లు కూడా ఆ వింత గెటప్‌ని పసిగట్టలేకపోయారు.

ఈ ఘటన అట్టాంటాలోని హెన్నీ కౌంటీలో చోటుచేసుకంది. దోపిడి చేసేటప్పుడూ ఆ వ్యక్తి  పూల దుస్తులతో ఆకర్షణీయంగా వచ్చాడు.ఈ  మేరకు వృద్ధురాలి రూపంలో వచ్చిన వ్యక్తి ఫోటోలను పోలీసులు నెట్టింట షేర్‌ చేస్తూ... ఈ విషయం గురించి వెల్లడించారు. సదరు నిందితుడి ఆచూకి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిబ్బంది ఫిర్యాదు చేసేవరకు ఈ విషయం వెలుగు చూడకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మాధ్యమం‍లో తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు దొంగుల దొంగతనం చేయడం కోసం ఎంతకైన తెగిస్తారంటూ కామెంట్లు చేస్తూ.. ట్వీట్‌ చేశారు. 

(చదవండి: దెబ్బ తిన్న భారీ టెలిస్కోప్‌ జేమ్స్‌ వెబ్‌.. ఆందోళనలో నాసా)

మరిన్ని వార్తలు