అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. నాలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

30 Jan, 2022 15:31 IST|Sakshi

అమెరికాలో మంచు తుపాను విలయంతో నాలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. తూర్పు కోస్తా రాష్ట్రాలైన న్యూయార్క్‌, బోస్టన్‌, ఫిలడెల్ఫియా నగరాల్లోని రహాదారులపై రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. శీతలగాలుల తీవ్రతతో ఈ హిమపాతం మరో నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందని అమెరికా వాతావరణ విభాగం అంచనా వేసింది.

తుపాను కారణంగా అత్యవసర సేవలు మినహా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మంచుతుపాను ధాటికి దేశవ్యాప్తంగా నాలుగు వేలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్‌, షికాగో, బోస్టన్‌ రాష్ట్రాల్లో విమానాశ్రయాలు పూర్తిగా మంచులో నిండిపోయాయి. రోడ్లపై రెండు అడుగులకు పైగా మంచు పేరుకు పోవడంతో అక్కడి రోడ్లన్ని ప్రమాదకరంగా మారాయి. మంచు కారణంగా రోడ్ల మీదకు వస్తున్న వాహనాలు అదుపు తప్పి పడిపోతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో ఇప్పటికే చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. 

మరిన్ని వార్తలు