Sakshi News home page

అమెరికాలోనే హెచ్‌–1బీ వీసాల రెన్యూవల్‌

Published Thu, Nov 30 2023 5:23 AM

USA to begin domestic H-1B visa renewals this December - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో హెచ్‌–1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులకు  అమెరికా స్టేట్‌ ఫర్‌ వీసా సరీ్వసెస్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రెటరీ జూలీ స్టఫ్ట్‌ శుభవార్త చెప్పారు. హెచ్‌–1బీ వీసాల రెన్యూవల్‌ (స్టాంపింగ్‌) కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని, అమెరికాలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. డిసెంబర్‌ నుంచి మూడు నెలలపాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కొన్ని కేటగిరీల్లో హెచ్‌–1బీ వీసాలకు డొమెస్టిక్‌ రెన్యూవల్‌ ప్రక్రియ డిసెంబర్‌ నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

అమెరికాలో పెద్ద సంఖ్యలో భారత ఐటీ నిపుణులు హెచ్‌–1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తాజా నిర్ణయంతో వీరికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వ్యయ ప్రయాసలు తప్పుతాయి. అయితే, తొలి దశలో 20,000 మందికే ఈ వెసులుబాటు కలి్పంచనున్నట్లు తెలిసింది. ఆ  తర్వాత దశల వారీగా మరికొంతమందికి అవకాశం కలి్పస్తారు.

డిసెంబర్‌ నుంచి మూడు నెలల్లోగా హెచ్‌–1బీ వీసా గడువు ముగిసేవారు వీసా రెన్యూవల్‌ (స్టాంపింగ్‌)ను అమెరికాలోనే చేసుకోవచ్చు. అమెరికా వీసాలకు భారత్‌లో భారీ డిమాండ్‌ ఉందని జూలీ స్టఫ్ట్‌ గుర్తుచేశారు. వీసా కోసం కొన్ని సందర్భాల్లో ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వస్తోందని చెప్పారు. భారతీయులకు సాధ్యమైనంత త్వరగా వీసా అపాయింట్‌మెంట్లు ఇవ్వాలని భావిస్తున్నామని వివరించారు. ఇందులో ఒక మార్గంగా డొమెస్టిక్‌ వీసా రెన్యూవల్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. దీనివల్ల భారతీయ టెకీలకు లబ్ధి కలుగుతుందన్నారు

మనవారికి 1.4 లక్షల వీసాలు
2022లో భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో 1.4 లక్షలకుపైగా వీసాలు జారీ చేసినట్లు స్టఫ్ట్‌ వెల్లడించారు. అమెరికా వర్సిటీల్లో తరగతుల ప్రారంభానికి ముందే భారత్‌లో స్టూడెంట్‌ వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేయడానికి సిబ్బంది కొన్నిసార్లు వారమంతా పనిచేస్తున్నారని తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement