కరోనా పుట్టుకపై డబ్యూహెచ్‌ఓ సంచలన ప్రకటన 

11 Feb, 2021 15:43 IST|Sakshi

కరోనా మహమ్మారి పుట్టుకపై వరల్డ్‌ హెల్త్‌ అర్గనైజేషన్‌(డబ్యూహెచ్‌ఓ) సంచలన ప్రకటన చేసింది. వైరస్‌ పుట్టింది వూహాన్‌లో కాదని, మహమ్మారి వైరస్‌ బీజాలు ఆస్ట్రేలియాలో ఉన్నాయని డబ్యూహెచ్‌ఓ అనుమానాన్ని వ్యక్తం చేసింది. దీంతో పాటు డబ్యూహెచ్‌ఓ మరిన్ని అనుమానాలకు తెరలేపింది. కరోనా వైరస్‌ కచ్చితంగా ల్యాబ్‌లో తయారు చేసింది కాదని, ఆస్ట్రేలియా నుంచి ఎగుమతైన బీఫ్‌లో వైరస్‌ ఉండి వుండవచ్చని సందేహాలను వ్యక్తం చేసింది. కరోనా కేసులు చైనాలో కంటే ముందే కొన్నిదేశాల్లో వెలుగు చూసి ఉండే అవకాశముందన్న అనుమానాన్ని సైతం వ్యక్తం చేసింది. 

అయితే ఈ ప్రకటనలను ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది. డబ్యూహెచ్‌ఓ.. చైనా ప్రభుత్వపు జేబు సంస్థగా మారిందని ఆరోపించింది. చైనా ప్రభుత్వం చేసిన ఆరోపణల వల్లె డబ్యూహెచ్‌ఓ ఇలాంటి ప్రకటనలను చేసివుంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. కాగా, కరోనా వైరస్‌ పుట్టుకపై ప్రపంచవ్యాప్తంగా అనేక 
అనుమానాలున్న నేపథ్యంలో డబ్యూహెచ్‌ఓ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 

మరిన్ని వార్తలు