కృత్రిమ గర్భధారణతో ఆడ దూడలే జననం

28 Mar, 2023 00:12 IST|Sakshi
దూడలను పరిశీలిస్తున్న డెయిరీ మేనేజర్‌ నాగయ్య

చిగురుమామిడి: కోడెల నుంచి ప్రత్యేకంగా సేకరించిన వీర్యంతో పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం వల్ల కేవలం ఆడదూడలు మాత్రమే జన్మి స్తాయని హుస్నాబాద్‌ డెయిరీ మేనేజర్‌ చింతపూల నాగయ్య అన్నారు. ఈ సదవకాశాన్ని చిగురుమామిడి మండలంలోని కరీంనగర్‌ డెయిరీ పరిధిలో పని చేస్తున్న పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల అధ్యక్షులు సద్వినియోగం చేసుకుంటే రూ.10 వేల ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు. సోమవారం గాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని బొల్లోనిపల్లెలో కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన ఆడ దూడలను కరీంనగర్‌ డెయిరీ ప్రతినిధులు పరిశీలించారు. పాడి ఆవులకు కేవలం ఆడ జీవాలే జన్మించాలంటే ప్రత్యేక వీర్యం ఒక డోస్‌ ఖరీదు రూ.850 ఉంటుందన్నారు. ఇందులో రూ.450 డెయిరీ చెల్లి స్తుందని, మిగతా రూ.400 రైతు భరించాల్సి ఉంటుందని చెప్పారు. అన్నదాతలు వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమపై దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో బయాఫ్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ ముత్యంరెడ్డి, రూట్‌ సూపర్‌వైజర్‌ సీత రవి, డెయిరీ వెటర్నరీ అసిస్టెంట్‌ సురేశ్‌, బొల్లోనిపల్లె డెయిరీ అధ్యక్షుడు రాజేశం, కార్యదర్శి శ్రీను, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక వీర్యం ఒక డోస్‌ ధర రూ.850

హుస్నాబాద్‌ డెయిరీ మేనేజర్‌ నాగయ్య

మరిన్ని వార్తలు