హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభాస్‌.. వైరలవుతోన్న ఫోటోలు

29 Apr, 2021 18:39 IST|Sakshi

సుజిత్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన సాహో' డిజాస్టర్ తర్వాత సినిమాల వేగం పెంచాడు స్టైలిష్‌స్టార్‌ ప్రభాస్. ఊపిరి సలపనంతా బిజీగా మారాడు. మరో రెండు, మూడేళ్లు ఖాళీ లేకుండా రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీ.. ఇలా బోలేడు ప్రాజెక్టులు ప్రభాస్‌ చేతిలో ఉన్నాయి. రాధాకృష్ణ రూపొందిస్తున్న రాధే శ్యామ్‌ జూలై 3న విడుదల కానుంది. ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న బుట్టబొమ్మ పూజా హెగ్డేకు కరోనా సోకడంతో ఈ సినిమా వర్క్‌ ఆగిపోయింది. ఇక సలార్‌, ఆదిపురుష్‌ చిత్రీకరణ దశలో ఉండగా, నాగ్‌ అశ్విన్‌ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉంది. 

ఇటీవల ప్రభాస్‌ తన వ్యక్తిగత మేకప్‌ ఆర్టిస్ట్‌కు కరోనా సోకడంతో  హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. హీరోతోపాటు రాధే శ్యామ్‌ యూనిట్‌ మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లారు.  అయితే ప్రభాస్‌కు కరోనా వచ్చిందేమో నని, రాధేశ్యామ్‌ షూటింగ్‌ నిలిచిపోయిందని డార్లింగ్‌ అభిమానులంతా తెగ కంగారు పడిపోయారు. కానీ తాజాగా ప్రభాస్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కాడు. ముఖానికి తెలుపు రంగు మాస్క్‌, షర్ట్‌, క్యాప్‌, కళ్లద్దాలతో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. కాస్త బక్కచిక్కిన ప్రభాస్ కొత్త లుక్‌ క్యాజువల్ డ్రెస్‌లో దర్శనమిచ్చాడు.  దీంతో ప్రభాస్‌కు ఏమీ కాలేదని ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

చదవండి: ఐసోలేషన్‌లోకి ప్రభాస్‌.. రాధేశ్యామ్‌ షూటింగ్‌కు బ్రేక్‌!

మరిన్ని వార్తలు