పుట్టిన రోజు బతకాలని లేదని పోస్ట్‌ చేసిన నటి

5 Aug, 2021 13:57 IST|Sakshi

తమిళనాట బిగ్ బాస్‌తో పాటు కాంట్రవర్సీలతోనే ఫేమస్ అయ్యింది నటి యషిక ఆనంద్. కొద్ది రోజులు కిత్రం ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదం గురైన సంగతి తెలిసిందే. దీంతో యాషిక కొద్ది రోజులుగా బెడ్డుకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. తాజాగా ఈ నటి ఆగస్ట్ 4న తన పుట్టి రోజు సందర్భంగా భావోద్వేగానికి  లోనవుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 

యాషికకు జరిగిన ప్రమాదంలో తాను తీవ్రంగా గాయపడినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో తన స్నేహితురాలిని పోగొట్టుకుంది.  ఇక అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ అమ్మడు ఇటీవలే కోలుకుంది. అయితే పూర్తిగా ఆరోగ్యవంతురాలు కావడానికి కొంత కాలం పడుతుందని వైద్యులు తెలిపారట. కాగా బుధవారం యాషిక తన స్నేహితురాలి మరణం తట్టుకోలేక సోషల్‌ మీడియాలో తన బాధని పోస్ట్‌ రూపంలో పంచుకుంది. అందులో.. తనకు బతకాలని లేదంటూ ఎమోషనల్ అయ్యింది. తను చేసిన తప్పుకు ఆమె స్నేహితురాలు ఎప్పటికి తనని క్షమించదని, వారి కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చినందుకు అనుక్షణం తాను కుమిలిపోతున్నట్లు తెలిపింది.

ఐసీయూలో ఉన్నప్పటికీ ప్రతిక్షణం తనకు నా స్నేహితురాలే గుర్తుకొచ్చింది. ఆమె జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతాయని ఈ అమ్మడు చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఏదేమైనా కూడా బర్త్ డే రోజే బతకాలని లేదనడం మాత్రం ఆమె ఫాలోవర్లను కాస్త బాధపెట్టిందనే చెప్పాలి. యాక్సిడెంట్ జరిగితే అయితే మీరేం చేస్తారు.. ధైర్యంగా ఉండాలంటూ నెటిజన్లు యాషికకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. 
 

మరిన్ని వార్తలు