నీటి ఆవశ్యకతపై అవగాహన పెంచుకోవాలి

29 Mar, 2023 02:38 IST|Sakshi
అవగాహన కల్పిస్తున్న ఐసీఏఆర్‌ శాస్త్రవేత్త భజేంద్ర

మోత్కూరు: నీటి ఆవశ్యకతపై రైతులు, విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌) శాస్త్రవేత్తలు భజేంద్ర, ముత్తూరమన్‌ అన్నారు. మంగళవారం మండలంలోని దత్తప్పగూడెం రైతు వేదికలో రైతు ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతులు, విద్యార్థులకు నీటి ఆవశ్యకతపై నిర్వహించిన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. నీటి వినియోగం, నీటి కాలుష్యం తదితర విషయాలను వివరించారు. భూసార పరీక్షలు నిర్వహించి నేల సామర్థ్యం, అనువైన పంటల దిగుబడులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ ఎలుగు శోభ, ఎంపీటీసీ సభ్యుడు ఆకవరం లక్ష్మణాచారి, రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆర్థిక సహకారంతో సిరి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్‌ మత్స్యగిరి, రైతు సంఘం సీఈఓ నర్సింహాచారి, మండల వ్యవసాయ అధికారి స్వప్న, ఏఈఓ సైదులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు