ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..!

10 Jun, 2023 17:54 IST|Sakshi

ఒక్క క్షణం గుండె ఆగిపోయినంతపని ఎప్పుడు అనిపిస్తుంది మనకు? అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అని సింపుల్‌గా చెప్పేయకండి. అడవిలో సంచరిస్తున్నప్పుడు ఒక్కసారిగా క్రూర మృగం మీకు ఎదురైతే ఏం చేస్తారు? కాళ్లు చేతులు ఏం ఆడవు. చెమటలు పట్టేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో గుండె చప్పుడే అతిపెద్ద శబ్దంలా వినిపిస్తది కదా..!

ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర ఎప్పుడూ ఏదో ఒకటి షేర్ చేస్తుంటారు. ట్విట్టర్ వేదికగా వినూత్న ఆలోచనలను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇలానే ఈసారి కూడా ఓ వీడియో షేర్ చేశారు. కాకపోతే ఇది కొంచెం విభిన్నమైనది. ఈ వీడియోలో ఓ వ్యక్తి అడవిలో ఫొటోలు తీయడానికి వెళతారు. కారు ముందు భాగంలో కూర్చుని ఓ వైపు చూస్తుంటారు. తలతిప్పేసరికి ఆ వ్యక్తి ఎదుట సింహం ప్రత్యక్షమవుతుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలాంటి స్థితిలో మీకు వచ్చే మొదటి ఆలోచన ఏంటి? మీరు చేసే మొదటి పని ఏంటీ? అని ఆనంద్ మహేంద్ర తన ఫాలోవర్స్‌ను అడిగారు. ఇంతకూ మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేసేయండి మరి..!  

ఇదీ చదవండి:విహారంలో అపశృతి..టూరిస్టు స్విమ్మింగ్ చేస్తుండగా.. సొర ఎంట్రీ..క్షణాల్లోనే..

మరిన్ని వార్తలు