బెంగళూరు ఎయిర్‌పోర్టులో 206 ఐఫోన్లు సీజ్

2 Mar, 2021 05:05 IST|Sakshi

సాక్షి, దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు రూ.2.8 కోట్ల విలువైన ఆపిల్‌ కంపెనీ ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అమెరికా పాస్‌పోర్టు కలిగిన భారతీయ దంపతుల నుంచి వీటిని సీజ్‌ చేశారు. ఫిబ్రవరి 13న ముంబై నుంచి ఫ్రాన్స్‌ వెళ్లిన దంపతులు ఆదివారం రాత్రి ప్యారిస్‌ నుంచి విమానంలో బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. అధికారులు వారి లగేజీని సోదా చేయగా రూ.2.8 కోట్ల విలువ చేసే 206 ఐఫోన్‌ 12ప్రొ మాక్స్‌  ఫోన్లు బయటపడ్డాయి.   బిల్లులు చూపకపోవడంతో ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు.   

చదవండి: (పెట్రోలు బాంబు మంటల్లో హీరోకు గాయాలు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు