అస్సాం కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా భూపేన్‌ 

25 Jul, 2021 01:03 IST|Sakshi

న్యూఢిల్లీ: అస్సాం కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా భూపేన్‌ బొరాను నియమిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ శనివారం తెలిపింది. ప్రస్తుతం చీఫ్‌గా ఉన్న రాజ్యసభ సభ్యుడు రిపున్‌ బొరా స్థానంలో ఆయన బాధ్యతలు నిర్వహిస్తారని స్పష్టం చేసింది. భూపేన్‌తో పాటు మరో ముగ్గురు కార్యనిర్వాహక అధ్యక్షులను కూడా ప్రకటించింది. వారిలో రాణా గోస్వామి, కమలాఖ్య దేవ్‌ పురకాయస్థ, జాకీర్‌ హుస్సేన్‌ సిక్‌దార్‌లు ఉన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. భూపేన్‌ బొరా, రాణా గోస్వామిలను అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శులుగా విధుల నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు మణిపూర్‌ కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా లోకెన్‌ సింగ్‌ నియమితులయ్యారు. పూర్తి స్థాయి అధ్యక్షుడు వచ్చే వరకు ఆయన బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపింది. ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సేవా దళ్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌గా ఆర్య కుమార్‌ జ్ఞానేంద్రను నియమించింది.   

మరిన్ని వార్తలు