కరోనా: మళ్లీ లక్ష దాటిన కొత్త కేసులు

7 Apr, 2021 10:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ అంతకంతకూ విజృంభిస్తోంది. కనివినీ ఎరగని రీతిలో పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఓవైపు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగానే.. మరోవైపు కేసులు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. గత 24 గంటల్లో 1,15,736 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 630 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. 59,856 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కి పెరిగింది. ఇప్పటి వరకు 1,17,92,135 మంది కోలుకొని డిశ్చార్జి అ‍య్యారు. ప్రస్తుతం 8,43,473 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరణాల సంఖ్య 1,66,177 గా ఉంది.  

మరోవైపు తెలంగాణలో కొత్తగా 1914 కరోనా కేసులు నమోదవ్వగా అయిదుగురు మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 393, మేడ్చల్‌లో 205 కరోనా కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌ 179, రంగారెడ్డి 169, నిర్మల్‌లో 104 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3,16,649 కరోనా కేసులు ఉండగా, 11,617 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 3,03,298 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,734 మంది మృతి చెందారు.

చదవండి: కరోనా హెచ్చరిక: వచ్చే 4 వారాలు అత్యంత సంక్లిష్టం 

మరిన్ని వార్తలు