తాగిన మత్తులో కొండ చిలువతోనే ఆటలు.. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది!

11 Nov, 2022 08:16 IST|Sakshi

తాగిన మైకంలో కొందరు వ్యక్తులు చేసే పనులు చూస్తే షాక్‌ అవుతుంటాము. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో చేసిన పని.. ప్రాణాలకు మీదకు తెచ్చింది. బతుకు జీవుడా అన్నట్టుగా గాయాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని కితాసోటి ఖుర్ద్ గ్రామానికి చెందిన బిర్జాలాల్ రామ్ భూయాన్ అనే వ్యక్తి ఫుల్‌గా మద్యం సేవించి ఆ ప్రాంతంలో ఉన్న డ్యామ్‌ వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఓ భారీ కొండ చిలువ కనిపించడంతో సరదాగా దాన్ని పట్టుకుని మెడలో వేసుకున్నాడు. అనంతరం.. కొండ చిలువ అతని మెడకు చుట్టుకుంది. దీంతో, అతడు ఎంత ప్రయత్నించినా పాము రాకపోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 

ఇంతలో అక్కడే ఉన్న రామ్‌ భూయాన్‌ కొడుకు, అతడి స్నేహితులు కలిసి పామును విడిపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రామ్‌ భూయాన్‌.. నీటిలో పడిపోయాడు. ఇద్దరు యువకులు.. కొండ చిలువను విడిపించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో​, బాధితులు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు