తమిళనాట ట్విస్ట్‌.. పన్నీర్‌సెల్వానికి బిగ్‌ షాక్‌

27 Aug, 2022 07:16 IST|Sakshi

మద్దతుదారులకు సైతం జారీకి నిర్ణయం 

అన్నాడీఎంకే కార్యాలయంపై దాడి వ్యవహారం 

ఓపీఎస్‌కు భాగ్యరాజ మద్దతు  

సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోకి చొరబడి నష్టం కలిగించిన వ్యవహారంపై పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులకు సమన్లు జారీచేయాలని సీబీసీఐడీ పోలీసులు నిర్ణయించారు. వైద్యలింగం, మనోజ్‌ పాండియన్‌ తదితరులకు సైతం సమన్లు పంపనున్నారు. సీబీసీఐడీ డీఎస్పీ నేతృత్వంలోని ఒక బృందం శుక్రవారం పార్టీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించింది.

చెన్నై వానగరంలో గతనెల 11వ తేదీన జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి పళనిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఇందుకు నిరసనగా పన్నీర్‌సెల్వం సహా ఆయన అనుచర వర్గం తీవ్ర ఆగ్రహంతో చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయ ప్రధాన ద్వారాన్ని పగులగొట్టిలోనికి జొరబడి ఫరి్నచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని, ముఖ్యమైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని ఎడపాడి వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం చెన్నై రాయపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు ప్రతిగా పన్నీర్‌ వర్గం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో రెండు వర్గాలకు చెందిన చెరో 200 లెక్కన మొత్తం 400 మంది కార్యకర్తలపై పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణను గ్రేటర్‌ చెన్నై పోలీసుల నుంచి సీబీసీఐడీ పోలీసులకు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. కార్యాలయంపై దాడి వ్యవహారంపై ఓపీఎస్, ఆయన మద్దతుదారు ముఖ్యనేతలకు వేర్వేరుగా సమన్లు జారీచేసి విచారణ చేపట్టాలని సీబీసీఐడీ నిర్ణయించింది.  

పన్నీరుసెల్వంకు దర్శకుడు భాగ్యరాజ మద్దతు
ఎంజీఆర్‌ స్థాపించిన అన్నాడీఎంకేను అంద రూ కలిసి కాపాడుకోవాలని ప్రముఖ సినీ దర్శకులు భాగ్యరాజా అన్నారు. పారీ్టలో, న్యాయస్థానాల్లో చో టుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించేందుకు పన్నీర్‌సెల్వం తన అనుచరులతో శుక్రవారం చెన్నై లో సమావేశమయ్యారు. ఇందులో భాగ్యరాజ పా ల్గొని పన్నీర్‌కు మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఒక చిన్న కార్యకర్తలా పార్టీ క్షేమాన్ని కోరుతున్నానని, పారీ్టలోని అన్ని వర్గాలు ఏకం అవుతాయని, ఇందుకు సమయం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు