విద్యార్థుల‌కు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు

11 Aug, 2020 09:03 IST|Sakshi

చండీగ‌ఢ్ :  రాష్ర్టంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న 12వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాల‌ని పంజాబ్ ముఖ్య‌మంత్రి  కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయించారు. రేపు (ఆగ‌స్టు 12) యువ‌త దినోత్స‌వం సంద‌ర్భంగా విద్యార్థుల‌కు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామ‌ని వెల్లడించారు. క‌రోనా కార‌ణంగా విద్యార్థుల‌కు ఆన్‌లైన్‌లోనే పాఠాలు నిర్వ‌హిస్తున్నందున, పేద విద్యార్థులు న‌ష్ట‌పోకుండా ఉండేందుకే ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని తెలిపారు. రాష్ర్టంలోని వివిధ ప‌ట్ట‌ణాలు, జిల్లా కేంద్రాల్లో విద్యార్థుల‌కు పోన్ల‌ను పంపిణీ చేస్తామ‌న్నారు. ఈ ప‌థ‌కం విద్యార్థుల‌కు ఎంతో  మేలు చేస్తుంద‌ని సీఎం అన్నారు.గ‌తంలోనే రాష్ర్టంలోని యువ‌త‌కు ఉచితంగా స్మార్ట్‌ఫోన్ల‌ను ఇస్తామ‌ని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌రోనా సంక్షోభంలో సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. మొద‌టిద‌శలో సుమారు 1.75 ల‌క్ష‌ల ఫోన్లను ఇవ్వ‌నున్నట్లు అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. (ప్రణబ్‌కు బ్రెయిన్‌ సర్జరీ)

మరిన్ని వార్తలు