ఐదవ నెలా లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

1 Mar, 2021 20:27 IST|Sakshi

న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా భారీగా పడిపోయిన జీఎస్‌టి వసూళ్లు తిరిగి గాడిన పడ్డాయి. వరుసగా ఐదవ నెలలో కూడా జీఎస్‌టి వసూళ్లు లక్ష కోట్ల మార్కును దాటాయి. ఫిబ్రవరి నెలలో జీఎస్‌టి వసూళ్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1.13 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది వసూళ్లు 7 శాతం పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,13,143 కోట్లు కాగా గత నెలలో వసూలు చేసిన రూ.1,19,875 కోట్ల రూపాయల కన్నా తక్కువ. 

ఫిబ్రవరి నెలకు గాను వసూలైన జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.21,092 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.27,273 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.55,253 కోట్లు, సెస్సులు కింద రూ.9,525 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. వరుసగా ఐదో నెలా లక్ష కోట్లు దాటాయని, జీఎస్టీ వసూళ్లు తిరిగి పుంజుకున్నాయనడానికి ఇదే నిదర్శమని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ నెలలో వస్తువుల దిగుమతి ద్వారా వచ్చిన ఆదాయం గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే 15 శాతం ఎక్కువ అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

చదవండి:

కోవిన్‌ 2.0 రెడీ.. రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా!

వాట్సాప్ లో అందుబాటులోకి సరికొత్త ఫీచర్

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు