అలా చేస్తేనే ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు: మాజీ మేజర్‌ శ్రీనివాస్‌

8 Dec, 2021 17:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మరికొంతమంది అధికారులు ఉన్నట్లు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు. ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడ్డారు. 

కాగా, ప్రమాద ఘటనపై మాజీ మేజర్‌ శ్రీనివాస్‌ స్పందిస్తూ.. బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌ అత్యంత సురక్షితమైది. ఇది ప్రమాదామా? లేదా ఏదైనా కుట్ర కోణమా అన్న దానిపై అన్ని కోణాల్లో విచారణ జరగాలి. హైలెవెల్‌ కమిటీ చేత విచారణ జరపాలి. బ్లాక్‌బాక్స్‌లో పైలెట్‌ సంభాషణలు రికార్డ్‌ అవుతాయి. బ్లాక్‌బాక్స్‌ని రికవరీ చేసి వాటిని డీ కోడ్‌ చేస్తే చివరి నిమిషంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌తో వారు మాట్లాడిన మాటలు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం జరిగింది అనేది తెలుసుకోవచ్చు' అని మాజీ మేజర్‌ శ్రీనివాస్‌ అన్నారు.

చదవండి: (బిపిన్‌రావత్‌కు అత్యవసర చికిత్స.. మిగతా వారంతా దుర్మరణం) 

మరిన్ని వార్తలు