శుభవార్త: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

31 May, 2021 10:38 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మ‌ర‌ణాలు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. అదే స్థాయిలో యాక్టీవ్ కేసుల సంఖ్య త‌గ్గ‌డం ఊర‌ట క‌లిగించే విష‌య‌మ‌ని ఆరోగ్య‌శాఖ నిపుణులు చెబుతున్నారు. గత 24గంటల్లో భారత్‌లో 1,52,734 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,80,47,534కు పెరిగింది. ఇక గత 24 గంటల్లో 3,128 మంది కోవిడ్‌తో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 3,29,100కు చేరింది.

అదే విధంగా గత 24 గంటల్లో 2,38,022 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,56,92,342కు పెరిగింది.  దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 20,26,092కు చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 21,31,54,129 కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 91.60 శాతం ఉండ‌గా మరణాల రేటు 1.17 శాతంగా న‌మోదైంది.
చదవండి: వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్‌!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు