విజయవంతంగా రుద్రం-1 క్షిపణి ప్రయోగం

9 Oct, 2020 18:32 IST|Sakshi

భువనేశ్వర్‌ : శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాల సన్నాద్ధమవుతోంది. దేశ రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే వాయుసేన అమ్ముల పొదలోని తిరుగులేని అస్త్రాన్ని పరీక్షించింది. శత్రు దేశాల రాడార్లను మట్టి కరిపించే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన రుద్రం -1  క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లో సుఖోయ్‌-30 నుంచి శుక్రవారం ఉదయం ప్రయోగించిన ఈ మిసైల్‌ నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినట్లు డీఆర్‌డీఓ అధికారికంగా ప్రకటించింది. చదవండి: 'శౌర్యం' చూపుతున్న భారత క్షిపణి

సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి కూడా ప్రయోగించిన ఈ మిసైల్ శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదు. ఇది కనిష్టంగా 500 మీటర్లు, గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఇటీవ‌ల వ‌రుస‌గా క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌ను డీఆర్‌డీవో నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే భార‌త్‌.. స్మార్ట్ టార్పిడో మిస్సైల్‌ను ప‌రీక్షించింది. క్షిపణి ప్రయోగం విజయవంతమవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చదవండి: సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు