అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర క్షిపణి పరీక్ష | Sakshi
Sakshi News home page

అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర క్షిపణి పరీక్ష

Published Mon, Nov 6 2023 6:01 AM

Russian nuclear submarine test launches Bulava intercontinental missile - Sakshi

మాస్కో: అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం విజయవంతంగా నిర్వహించినట్లు రష్యా ఆర్మీ ఆదివారం ప్రకటించింది. ఈ క్షిపణి అణువార్‌హెడ్లను మోసుకెళ్లగలదని స్పష్టం చేసింది.

ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధంతో రష్యా, పశ్చిమదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడం, అంతర్జాతీయ అణు పరీక్ష నిషేధ ఒప్పందం నుంచి వైదొలుగుతూ రష్యా పార్లమెంట్‌ ఆమోదించిన బిల్లుపై అధ్యక్షుడు పుతిన్‌ గత వారం సంతకం చేసిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇంపరేటర్‌ అలెగ్జాండర్‌ 3 అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర బులావా క్షిపణిని రష్యా ఉత్తర తెల్ల సముద్రంలో నీటి అడుగు నుంచి పరీక్షించి చూసినట్లు రష్యా రక్షణ శాఖ వివరించింది.

Advertisement
Advertisement