International Day for Older Persons: భారమవుతున్న పేగు బంధాలు.. చివరకు ఛీత్కారాలే

1 Oct, 2022 14:50 IST|Sakshi

నేడు వయోవృద్ధుల దినోత్సవం 

పిల్లలు పుట్టింది మొదలు జీవితంలో స్థిరపడే వరకు వారి కోసమే అన్నట్లుగా కష్టపడుతుంటారు తల్లిదండ్రులు. వృద్ధాప్యంతో బాధపడుతున్నా.. పిల్లలు దూరంగా ఉంటున్నా.. వీరి మనసు మాత్రం బిడ్డల చుట్టే తిరుగుతుంది. ఎన్నో త్యాగాలు చేసి కూడబెట్టిన ఆస్తిపాస్తులను వారి బిడ్డల పేరున రాస్తున్నారు. అప్పటి వరకు బాగా ఉండే పిల్లలు ఆస్తి చేతిలో పడగానే మారిపోతున్నారు. కన్న వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు.

చట్టం ఏం చెబుతుందంటే? 
కేంద్రం తల్లిదండ్రులు, వయోవృద్ధులు పోషణ చట్టం– 2007 తీసుకొచ్చింది. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది. పిల్లల నుంచి పోషణ ఖర్చులు ఇప్పించడానికి ఈ చట్టం వీలు   కల్పిస్తుంది. బాధితులు రెవెన్యూ డివిజన్‌ స్థాయిలోని ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై ఆర్డీఓ విచారణ అనంతరం పోషణ ఖర్చులు ఇవ్వాలని ఆదేశిస్తారు. ఆదేశాలు అమలుకాకుంటే జిల్లా అప్పి లేట్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. పిల్లలకు రాసిచ్చిన ఆస్తులను స్వాధీనం చేసుకునే వీలు కల్పిస్తుంది. అయితే తొలుత గృహహింస కేసులు నమోదు చేయిస్తున్నా..ఆ తర్వాత తమ పిల్లలు ఇబ్బంది పడతారనే ఆలోచనతో వాటిని ఉపసంహరించుకుంటున్నారు.   

పింఛన్‌ డబ్బులూ లాగేసుకుంటుండ్రు 
ప్రాణం పోసిన అమ్మానాన్నలకు చివరకు ఛీత్కారాలే మిగులుతున్నాయి. కొందరైతే తల్లిదండ్రుల పింఛన్‌ డబ్బులను కూడా లాగేసుకుంటున్నారు. కన్నవారికి ఆసరాగా ఉండాల్సిన కుమారులే నరకం చూపిస్తున్నారు. ఇళ్లు, స్థలాలను లాగేసుకుని బయటికి వెళ్లగొడుతున్న ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. వయోభారంతో ఉన్న వారు కష్టాలను ఎవరికి చెప్పుకోలేక  తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రతినెలా వీరికి ఇస్తున్న పెన్షన్‌ డబ్బులను కూడా కొడుకులు, కో డళ్లు, మనవళ్లు బలవంతంగా వారి నుంచి  లాక్కుంటున్నారు. బయటికి చెబితే పిల్లల పరువు పో తుందనే భయంతో వృద్ధులు మౌనంగా ఉంటున్నారు.    

60 శాతం పెరిగిన వేధింపులు 
తల్లిదండ్రులపై వేధింపుల విషయంలో పేదా గోప్పా తేడా లేదు. అంతో ఇంతో ఆస్తిపాస్తులున్న సంపన్న కుటుంబాల్లోనే ఈ వేధింపులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. 28.6 శాతం మంది వయోవృద్ధులు తమ పిల్లల నిర్లక్ష్యానికి గురైతే.. కోవిడ్‌ తర్వాత ఈ సంఖ్య 60 శాతం పెరిగినట్లు అంచనా. కోవిడ్‌ సమయంలో తుమ్మినా, దగ్గినా  ఛీ త్కారాలు తప్పలేదు. కొంతమందైతే ఏకంగా వా ళ్లను గదుల్లో బంధించిన దాఖలాలు లేకపోలేదు.

ఇదీ పరిస్థితీ
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల నుంచి పో షణ వేధింపులకు సంబంధించి ప్రతి నెలా 35 నుంచి 40 ఫిర్యాదులు అందుతున్నాయంటే పరిస్థితి ఎంత దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2020–21లో ప్రభుత్వ వయో వృద్ధుల సహాయ  కేంద్రం కాల్‌ సెంటర్‌ 14567 నంబర్‌కి 2020–21లో రాష్ట్ర వ్యాప్తంగా 46,771 ఫిర్యాదులు అందగా.. 2021–2022లో 14,567 ఫిర్యాదులు అందాయి. వీ టిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 2868 (37శాతం), మేడ్చల్‌లో 1404(18 శాతం)   రంగారెడ్డిలో 1093(14 శాతం) ఫిర్యాదులు అందడం గమనార్హం.  

మరిన్ని వార్తలు