పోలీసుల దాష్టీకం: బాలింత అన్న కనికరం కూడా లేదా?

9 Jul, 2021 08:36 IST|Sakshi

తుమకూరు/కర్ణాటక: మూడు నెలల బాలింతపై పోలీసులు దౌర్జన్యం చేశారు. ఆమె ఇంట్లోని సామగ్రినంతా బయటకు పడవేసి బాలింతతో పాటు చిన్నారిని ఇంటి నుంచి గెంటేశారు. ఈ ఘటన తురువేకెరె తాలూకా దండినశివర హోబళి బాణసంద గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామంలో సదరు బాలింతకు జరిగిన అన్యాయాన్ని మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసి అనంతరం ఆ గ్రామస్తులంతా ఆమెకు బాసటగా నిలిచారు.

ఆ మహిళకు న్యాయం చేయాలని గ్రామంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. అక్క, చెల్లికి పొలం వాటా విషయంలో వివాదం ఉంది. ఈ క్రమంలో చంద్రమ్మ అక్కడే గుడిసెలో ఉంటోంది. దీంతో తరచూ అక్క చెల్లి మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతుండటంతో పోలీసులు చంద్రమ్మను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని దౌర్జన్యానికి పాల్పడ్డారని  గ్రామస్తులు చెప్పారు.     

మరిన్ని వార్తలు