రిక్షాలో మినీ గార్డెన్‌...ఫోటోలు వైరల్

8 Apr, 2022 12:10 IST|Sakshi

Man Converts Rickshaw Into Mini Garden: పర్యావరణ కాలుష్యం నుంచి రక్షించుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సైతం ముందుకు వచ్చి రకరకాలుగా విన్నూతన పద్ధతుల్లో మొక్కలు పెంచే కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాకుండా స్థలం లేకపోయిన ప్రజలు మొక్కలు ఎలా పెంచుకోవచ్చు వంటివి చెప్పి మరీ పంచేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రజలు కూడా మిద్దే తోటని, వాల్‌ గార్డినింగ్‌ అని తమకు తోచిన రీతిలో మొక్కలను పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వాటన్నింటిని కాలదన్నేలా ఇక్కడొక వ్యక్తి విన్నూతన రీతిలో మొక్కలను పెంచి ఔరా అనిపించుకున్నాడు.

వివరాల్లోకెళ్తే...ఇక్కడొక వ్యక్తి తన రిక్షానే మినీగార్డెన్‌గా మార్చేశాడు. రిక్షాని చక్కని పూల మెక్కలు, పచ్చదనంతో నింపేశాడు. అంతేకాదు రిక్షాలో చిన్న చిన్న పూలకుండీలను కూడా ఏర్పాటు చేశాడు. ఈ మేరకు ఆ వ్యక్తి రిక్షా​​కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అవి కాస్త యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హీమ్‌ని తెగ ఆకర్షించాయి.  

ఆయన ట్విట్టర్‌లో ...ఈ భారతీయుడు ఎండలో కూడా చల్లగా ఉండేందుకు తన రిక్షా మీద గడ్డిని పెంచాడు. నిజంగా చాలా బాగుంది!. ఈ వేసవి వేడి తట్టుకునేందుకు ఇలా పచ్చటి మొక్కలతో రిక్షాని ఏర్పాటు చేసుకున్నాడు కాబోలు. అని అన్నారు. అంతేకాదు నెటిజన్లు కూడా ఆ రిక్షా డ్రైవర్‌ సృజనాత్మకతను మెచ్చుకోవడమే కాకుండా కస్టమర్‌లను ఆకర్షించేందకు ఇది చాల చక్కటి మార్గం అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: అమ్మాయి పుట్టిందని తండ్రి సంతోషం.. హెలికాప్టర్‌లో స్వాగతం)

మరిన్ని వార్తలు