44 మంది మావోయిస్టులు లొంగుబాటు

1 Jan, 2022 20:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఛత్తీస్‌గఢ్:మావోయిస్టు పార్టీకి చెందిన 9మంది మహిళలతో సహా 44మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట శనివారం లొంగిపోయారు. నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంపు కరిగుండం వద్ద లొంగిపోయారు. సుక్మా జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పున నాకం అభియాన్‌’(కొత్త ఉదయం-కొత్త ప్రారంభం) ప్రభావంతో లొంగిపోయినట్లు తెలుస్తోంది.

లొంగిపోయిన వారిలో ఓ నక్సలైట్‌పై ప్రభుత్వం రూ.2లక్షల రివార్డును ప్రకటించింది. కొంతమంది కారిగుండం గ్రామ పరిసర ప్రాంతాల చెందిన కొత్తవారు ఉన్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు, వారితో పాటు వచ్చిన గ్రామస్తులకు పోలీసులు ఆహారం అందించారు. లొంగిపోయిన నక్సలైట్లందరికీ ప్రభుత్వం పునరావాస పథకాల ప్రయోజనం అందజేస్తుందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ మీడియాకు తెలిపారు.

మరిన్ని వార్తలు