వందేభారత్‌ ట్రైన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గేదెలను ఢీకొట్టడంతో..!

6 Oct, 2022 15:06 IST|Sakshi

అహ్మదాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ముంబై సెంట్రల్‌- గాంధీనగర్‌ క్యాపిటల్‌ మధ్య ప్రారంభించిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. 
గురువారం ఉదయం రైలు పట్టాలపైకి గేదేలు రావటంతో వాటిని ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్ ముందుభాగం పూర్తిగా దెబ్బతిన్నది. బట్వా, మనినగర్‌ స్టేషన్ల మధ్య గురువారం ఉదయం 11.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. 

ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ట్రైన్‌ను బాగు చేసి గమ్యానికి చేర్చినట్లు పశ్చిమ రైల్వే జోన్‌ అధికారులు తెలిపారు. అనుకున్న సమయానికే గాంధీనగర్‌ క్యాపిటల్‌ నుంచి ముంబై సెంట‍్రల్‌ స్టేషన్‌కి చేరుకున్నట్లు చెప్పారు. గాంధీనగర్‌-ముంబై సెంట్రల్‌ మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను 2022, సెప్టెంబర్‌ 30న జెండా ఊపి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ట్రైన్‌ స్పీడును గరిష్ఠంగా 160 కిలోమీటర్లుగా  ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: Ravan Dahan: బెడిసి కొట్టిన రావణ దహనం.. ఆపై ఎద్దు వీరంగం.. వీడియో వైరల్‌

>
మరిన్ని వార్తలు