తల్లి తరఫున నోబెల్‌ శాంతి బహుమతి స్వీకరణ

11 Dec, 2023 06:06 IST|Sakshi
నర్గీస్‌ తరఫున బహుమానం స్వీకరిస్తున్న ఆమె పిల్లలు (ఇన్‌సెట్లో నర్గీస్‌)

కార్యక్రమంలో పాల్గొన్న ఇరాన్‌ కార్యకర్త నర్గీస్‌ కవలపిల్లలు

హెల్సింకీ: ఇరాన్‌ మానవ హక్కుల మహిళా కార్యకర్త నర్గీస్‌ మొహమ్మదీకి నోబెల్‌ కమిటీ ప్రకటించిన శాంతి బహుమతిని ఆమె తరఫున ఆమె కుమారుడు, కుమార్తె అందుకున్నారు. ఇరాన్‌లో మహిళల అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడుతున్న 51 ఏళ్ల నర్గీస్‌ను ఇరాన్‌ ప్రభుత్వం అక్రమ కేసులు మోపి టెహ్రాన్‌ జైలులో పడేసిన విషయం విదితమే.

శనివారం నార్వేలోని ఓస్లోలో నర్గీస్‌ కవల పిల్లలు అలీ, కియానా రహా్మనీ పురస్కారాన్ని స్వీకరించారు. ‘‘ఇరాన్‌ సమాజానికి అంతర్జాతీయ మద్దతు అవసరం. ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన మానవహక్కుల కార్యకర్తలు, నిరసనకారులు, పాత్రికేయుల గొంతుకను సభావేదికగా గట్టిగా వినిపించండి’’ అంటూ నర్గీస్‌ ఇచి్చన సందేశాన్ని వేదికపై వారు చదివారు.
 

>
మరిన్ని వార్తలు