ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలు...పాక్‌, చైనాకు ఊహించని ఝలక్‌

18 Nov, 2022 16:37 IST|Sakshi

No Money for Terror: పాక్‌ చైనాలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని అంతర్జాతీయ మంత్రివర్గ సమావేశంలో ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్సింగ్‌(నో మనీ ఫర్‌ టెర్రర్‌)పై మాట్లాడుతూ...."కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఉగ్రవాద వ్యతిరేక చర్యలను అడ్డుకుంటూ పరోక్షంగా మద్దుతిస్తున్నాయి. ఉగ్రవాదం పట్ల సానుభూతి చూపే సంస్థలు, వ్యక్తులను ఒంటరిని చేయాలి. ఇలాంటి విషయాల్లో క్షమాగుణం చూపకూడదు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేలా ప్రంపంచం ఏకం కావాలి.

ఈ సందర్భంగా లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌తో సహా ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు యత్నించిన అంతర్జాతీయ ప్రయత్నాలను చైనా ఎలా విఫలం చేసిందో ప్రస్తావించారు. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాలను అరికట్టేందుకు నిధులను నిలిపేయాలి. టెర్రర్‌ ఫైనాన్సింగ్‌పై దాడి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతేగాదు టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ కోసం కొత్తరకాల టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. అలాగే మనీలాండరింగ్‌, ఆర్థిక నేరాలు వంటి కార్యకలాపాలు టెర్రర్‌ ఫండింగ్‌కి సహయపడతాయని తెలుస్తోంది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యూఎన్‌ఎస్‌సీ, ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎఎఫ్‌ఏలీఎఫ్‌) వంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాయం చేస్తున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన ఒక్క దాడి జరిగిన, ఒక్క ప్రాణం పోయినా సహించం, నిర్మూలించేంత వరకు వదిలిపెట్టం. కాశ్మీర్‌ తరుచుగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటుందని, పరిష్కరించడం అత్యంత ముఖ్యమని చెప్పారు. యావత్తు ప్రపంచం ఉగ్రవాదాన్ని తీవ్రంగా పరిగణించక ముందే భారదత్‌ తీవ్ర భయాందోళనలు ఎదుర్కొందన్నారు.

ఎన్నో దశాబ్దాలుగా వివిధ రూపాల్లో ఉగ్రవాదం భారత్‌ని దెబ్బతీయాలని చూసిన తాము ధైర్యంగా పోరాడం" అని చెప్పారు. ఈ క్రమంలో సదస్సును ఉద్దేశించి అమిత్‌ షా మాట్లాడుతూ...ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేయడమే అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఉగ్రవాదాలను తమ హింసను నిర్వహించేందుకు... యువతను రిక్రూట్‌ చేసుకోవడం, ఆర్థిక వనరులను పెంచుకోవడం తదితరాల ఎప్పటికప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తారన్నారు. ఉగ్రవాదుల తమ ఉనికిని దాచేలా డార్క్‌నెట్‌ని వినియోగిస్తున్నారని జాగుకతతో ఉండాలని సూచించారు. 

(చదవండి: వీడియో: నెహ్రూ మునిమనవడి వెంట గాంధీ మునిమనవడు.. వైరల్‌)

మరిన్ని వార్తలు