స్టార్టప్‌లకు ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద వ్యవస్థ: ప్రధాని

16 Jun, 2021 19:26 IST|Sakshi

న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద వ్యవస్థని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బుధవారం జరిగిన వివాటెక్‌ సదస్సులో ప్రధాని వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారులు, తయారీదారులకు కావాల్సింది భారత్‌ అందిస్తోందని, ప్రతిభ, మార్కెట్‌, మూలధనం, పర్యావరణం, పారదర్శకతలో భారత్‌ మేటని వెల్లడించారు. ఫ్రాన్స్‌ సాంకేతిక విజన్‌కు వివాటెక్‌ సదస్సు నిదర్శనమని కొనియాడారు. భారత్‌, ఫ్రాన్స్‌ అనేక అంశాలపై కలిసి పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

చదవండి: ఆక్సిజన్ సిలిండర్‌తోనే సివిల్స్‌: రియల్‌ ఫైటర్‌ మూగబోయింది!

మరిన్ని వార్తలు