మైలవరం: టీడీపీ నేత దేవినేని ఉమాకు చేదు అనుభవం

16 Jun, 2021 19:30 IST|Sakshi

సాక్షి, కృష్ణా: మైలవరంలో టీడీపీ నేత దేవినేని ఉమాకు చేదు అనుభవం ఎదురైంది. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వంపై బురదజల్లే యత్నంలో దేవినేని ఉమా భంగపాటుకు గురయ్యారు. ఇళ్ల స్థలాల వద్దకు దళిత మహిళలను దేవినేని ఉమా తీసుకెళ్లగా.. ఆయనపై దళిత మహిళలు తిరగబడ్డారు. దేవినేని ఉమా అండ్‌ కోపై తిట్ల పురాణంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని పరిణామం ఎదురు కావడంతో దేవినేని ఉమా, అతని సభ్యులు అక్కడి నుంచి జారుకున్నారు.

మరిన్ని వార్తలు