‘పురంధేశ్వరి.. బాబు అవినీతిపై మీ భర్త రాసింది మర్చిపోయారా?’

17 Oct, 2023 14:34 IST|Sakshi

సాక్షి, నంద్యాల జిల్లా: చంద్రబాబు అవినీతి వ్యవహారాన్ని ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ సినిమాతో పోల్చారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. మంగళవారం ఆయన శ్రీశైలంలో మీడియాతో మాట్లాడుతూ, మా ప్రభుత్వానికి చంద్రబాబుపై కక్ష ఎందుకుంటుంది? బాబును అక్రమంగా అరెస్ట్‌ చేయలేదు, అన్ని ఆధారాలతోనే అరెస్ట్‌ చేశారు’’ అని మంత్రి పేర్కొన్నారు.

‘‘చంద్రబాబు ప్రభుత్వంలోనే స్కిల్‌ స్కామ్‌ ఆధారాలున్న ఫైల్స్‌ తగులబెట్టారు. పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. చంద్రబాబుకు ఇంటి భోజనం వస్తోంది. జైలుకు వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు కేజీ బరువు పెరిగారు. పురంధేశ్వరి చెల్లి కొడుకును తీసుకొని అమిత్ షాను కలిసింది. గతంలో ఆమె భర్త చంద్రబాబు గురించి బుక్స్ రాశారు అవి మర్చిపోయారా’’ అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
చదవండి: ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కడెక్కడ అనుకూలం?

మరిన్ని వార్తలు