-
అందమైన ఈ పువ్వులతో..హార్ట్ ఎటాక్ ముప్పు !
అందమైన పువ్వుల్ని చూడగానే మన ముఖంలో అనుకోకుండా చిరు నవ్వులు పూస్తాయి. ఒక్కోసారి అలాంటి మొక్కల్ని మన గార్డెన్లో కూడా పెంచుకోవాలని ఉబలాటపడతాం. ఇకపై ఇలాంటి ప్రయత్నాలకు కొంచెం ఆలోచన జోడించాల్సిందే! ఎందుకంటే కొన్ని రకాల పువ్వులు మనుషుల్లో గుండెపోటుకు కారణమవుతుందని నిపుణులు తాజాగా హెచ్చరి స్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రియమైన గార్డెన్ ఫేవరెట్‌గా పేరొందిన ఫాక్స్‌గ్లోవ్ పుష్పాలపై సైంటిస్టులు కీలకహెచ్చరికలు చేశారు. ఇది యూరప్ ఆసియాకు చెందిన తీగ జాతి మొక్క. ఈ మొక్కను "డెడ్ మ్యాన్స్ బెల్స్" లేదా "మంత్రగత్తెల చేతి తొడుగులు" అనే పేరుతో విక్రయిస్తారట. సాధారణ ఫాక్స్ గ్లోవ్ (డిజిటాలిస్ పర్పురియా) మొక్క పువ్వులు పింక్, పర్పుల్, తెలుపు, పసుపు ఇలా పలు రంగుల్లో ఉంటాయి. పెండ్యులస్, ట్రంపెట్ ఆకారలో గుత్తుల గుత్తుల పువ్వులు మంత్రముగ్ధులను చేస్తాయి. అమెరికాలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఫాక్స్‌గ్లోవ్ అందమైన పువ్వుల్ని ఇవ్వడమే కాదు, గుండెపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపే ఒక రకమైన కార్డియాక్ గ్లైకోసైడ్గా ఉండే డిగోక్సిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాల్ని కూడా కలిగి ఉంటాయి. ఇవి గుండె కండరాల పనితీరును ప్రభావితం చేస్తాయని బఫెలో, స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, డాక్టర్ జెన్ వాంగ్ లైవ్ సైన్స్‌తో చెప్పారు. ఆరోగ్యకరమైన గుండె వేలకొద్దీ కార్డియాక్ కణాల ద్వారా రక్తాన్ని శరీరానికి పంపిస్తుంది. వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ గా పిలిచే గుండె లయకు డిగోక్సిన్తో ఉన్నట్టుండి అంతరాయం ఏర్పడితే రసాయన సమస్యలు తలెత్తుతాయి. గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ లేదా, మరణానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఎవరైనా పొరపాటున మొక్కలోని ఏదైనా భాగాన్ని తీసుకుంటే, వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. ఫాక్స్‌గ్లోవ్ “చనిపోయినవారిని తిరిగి బతికించగలు. జీవించి ఉన్నవారిని చంపగలదు” అనేది పాత ఆంగ్ల సామెత. ఫాక్స్ గ్లోవ్‌లో అంతటి గొప్ప, ప్రాణాలను రక్షించే ఔషధ ఉపయోగాలు కూడా ఉన్నాయట. ఇదే విషయాన్ని డాక్టర్ వాంగ్ కూడా చెప్పారు. ఫాక్స్గ్లోవ్స్లోని డిగోక్సిన్ తో ప్రాణాంతక ప్రభావాలు ఉన్నప్పటికీ - డిగోక్సిన్ విలువైన గుండె మందులాగా చాలా పాపులర్ అని, ఇతర మందులేవీ పనిచేయనపుడు గుండె వైఫల్య చికిత్సలో ఇది బాగా పనిచేస్తుందని సూచించారు. -
క్షీణిస్తున్న భూమానాగిరెడ్డి ఆరోగ్యం
-
క్షీణిస్తున్న భూమానాగిరెడ్డి ఆరోగ్యం
కర్నూలు(జిల్లా పరిషత్): కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అక్రమంగాపెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టు అయిన నంద్యాల ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. మూడు రోజులుగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయనను సోమవారం వైద్యులు పరీక్షించారు. 1999లో గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న భూమా నాగిరెడ్డికి కార్డియాక్ ఎంజైమ్స్ పెరుగుతున్నందున ఆయనకు మరింత మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు షుగర్ లెవెల్స్ తగ్గడం లేదని వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. ఈ మేరకు ఆయనను ఉన్నతస్థాయి సౌకర్యాలున్న వైద్యశాలకు తరలించాలని వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. తాను రెగ్యులర్‌గా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స చేయించుకుంటున్నానని, తనను అక్కడికి పంపించాలని భూమా నాగిరెడ్డి కోరినట్లు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement