హైదరాబాద్‌ వెళ్లాలంటే ఎన్‌ఏఐ కోర్టును అడగండి: సుప్రీంకోర్టు

18 Aug, 2022 07:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: షరతులతో కూడిన మెడికల్‌ బెయిల్‌పై విడుదలైన విప్లవ రచయిత వరవరరావు హైదరాబాద్‌కు వెళ్లాలంటే అనుమతి కోసం జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) కోర్టును అభ్యర్థించాలని సుప్రీంకోర్టు సూచించింది. కంటి చికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు విచారించింది.

వరవరరావు తరఫు న్యాయవాది ఆనంద్‌ గ్రోవర్‌ వాదనలు వినిపించారు. సొంత నివాస స్థలమైన హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుంటే ఆ వాతావరణంలో వరవరరావు త్వరగా కోలుకుంటారని తెలిపారు. దీంతో అనుమతి కోసం ఎన్‌ఐఏ ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని వరవరరావుకు సుప్రీంకోర్టు సూచించింది.

ఇదీ చదవండి: Varavara Rao: వరవరరావుకు ఊరట.. శాశ్వత బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

మరిన్ని వార్తలు