గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌ సిద్ధం చేస్తున్నాం

27 Jan, 2022 04:16 IST|Sakshi

షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ 

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌ పనులు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చేపడుతున్నారని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ తెలిపారు. బుధవారం షార్‌లోని స్పేస్‌ సెంట్రల్‌ స్కూల్‌లో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. రాజరాజన్‌ జాతీయ జెండాను ఎగు రవేశారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ షార్‌ లో కోవిడ్‌ కారణంగా రెం డేళ్లుగా ప్రయోగాల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. షార్‌లోని ప్రయోగ వేదికలను గగన్‌యాన్‌ ప్రాజె క్ట్‌తో పాటు చంద్రయాన్‌–3 ప్రయోగానికి సంబం ధించి అనేక ప్రయోగాత్మక పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.

ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించి మౌలిక సదుపాయాలను నిర్దేశించిన సమయంలో పూర్తిస్థాయిలో సంసిద్ధం చేసేందుకు పని చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఘన ఇంధన మోటార్లు ఉత్పత్తి, ప్రయోగ పరీక్షలను చేస్తున్నామని తెలిపారు. కమ్యూనిటీ, కనెక్టివిటీ నినాదంతో ఇస్రో పని చేస్తోందని చెప్పారు. నేడు దేశంలో 850 చానల్స్‌ చూడగలుగుతున్నామంటే అది ఇస్రో చేస్తున్న ప్రయోగాల వల్లేనన్నారు. దేశ సరిహద్దుల్లో చొరబాట్లు, ఉగ్రవాదుల కదలికలు వంటి వాటిని టెక్నాలజీ ద్వారా కనిపెట్టగలుగుతున్నామన్నారు. 

మరిన్ని వార్తలు