క్షమించండి.. ఈరోజు సోమవారమా?!

18 Jan, 2021 13:13 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తనకు సంబంధించిన విషయాలను, ఫొటోలను తరచూ  సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాదు తనకు ఎదురయ్యే సందేహాలను, తన భావాలను పోస్టులుగా పెట్టడమే కాకుండా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తూంటారు. తాజాగా ఆమె సోమవారం ఉదయం లేస్తూనే ఇన్‌స్టాగ్రామ్‌లో‌ సందేహాన్ని వ్యక్తం చేశారు. ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె సిరీయస్‌గా చూస్తున్న ఫొటోను షేర్‌ చేశారు. (చదవండి: ‘వర్కింగ్‌ మదర్‌ కష్టాలు ఇలా ఉంటాయి’)

దీనికి ‘ఎక్స్‌క్యూజ్‌ మీ.. ఈ రోజు సోమవారమా??? సందేహాలతో మొదలైన ఈ వారం సమాధానంతో ఎండ్‌ అవ్వాలని ఆశిస్తున్న’ అంటూ పోస్టు చేశారు. స్మృతీ పోస్టు చూసిన టీవీ నటి దివ్య సెత్‌ షా ‘నాకు కూడా అలానే ఉంది’ అని కామెంట్‌ చేయగా.. ‘మీరు చేసే దానికంటే ఎక్కువగా మీ కళ్లు మాట్లాడుతున్నాయి’, ‘దయ, ప్రేమతో పాటు బలవంతులు మీరు.. త్వరలోనే అద్భుతమైన వారం మీ ముందుకు రాబోతుంది. హ్యాపీ మండే మేడమ్‌’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ చేస్తున్నారు. (చదవండి: నాకు కోపం తెప్పించొద్దు : స్మృతి ఇరానీ)

A post shared by Smriti Irani (@smritiiraniofficial)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు