Mysuru Royal Family: సర్కారుకు సుప్రీంలో చుక్కెదురు

28 Jul, 2021 19:57 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: చాముండిబెట్ట కొండ ప్రాంతం వద్ద కురుబారహళ్లి, ఆలనహళ్లి, చౌడహళ్లి మూడు సర్వే నంబర్లు కలిగిన భూ వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఈ వివాదాస్పద భూమి రాజవంశీకులదేనని సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. భూ వివాదానికి సంబంధించి గత జిల్లాధికారి రోహిణి సింధూరి, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాదాపు 1,563 ఎకరాల భూమిపై రెండు దశాబ్ధాలుగా వివాదం కొనసాగుతోంది. కేసు విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు ఈ భూమి మైసూరు మహారాజు ప్రైవేటు ఆస్తిగా పేర్కొంటూ తాజాగా తీర్పు వెలువరించింది. 

మరిన్ని వార్తలు