పెగాసస్‌పై సుప్రీంకోర్టులో విచారణ

17 Aug, 2021 12:45 IST|Sakshi

న్యూఢిల్లీ: పెగాసస్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. స్పైవేర్‌ వాడకంపై వివరాలు ఇవ్వలేమని కేంద్రం పేర్కొంది. దేశ భద్రతతో కూడుకున్న అంశమని సుప్రీంకోర్టు కేంద్రం తెలిపింది. కాగా పెగాసస్‌ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 10రోజులకు వాయిదా వేసింది.

ఇక సోమవారం పెగాసస్‌పై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పెగాసస్ గూఢచర్యం ఆరోపణలను నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పెగాసస్‌ ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రతిపక్షాలు, జర్నలిస్టుల ఆరోపణలను ​కేంద్రం కొట్టిపారేసింది. పెగాసస్‌పై నిజాలను నిగ్గు తేల్చేందుకు ట్రిబ్యునట్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో తెలిపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు