ఇప్పుడు కుక్కర్‌ ఖాళీగా ఉండదు!

24 Aug, 2020 16:39 IST|Sakshi

కోల్‌కతా: మమతా బెనర్జీ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న ఒక స్కీమ్‌కు సంబంధించి చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రసోడ్‌ మే ఖాళీ కుక్కుర్‌( వంటింట్లో ఖాళీ కుక్కర్‌) అనే పేరుతో ఒక వీడియోను రూపొందించి ఇంటర్నేట్‌లో షేర్‌ చేశారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఉచిత రేషన్‌కు సంబంధించిన పథకాన్ని ప్రచారం చేయడం కోసం ఈ వీడియోను ఉపయోగించుకుంటుంది. దీనికి సంబంధించి టీఎంసీ ట్విట్టర్‌ ద్వారా ఒక పోస్ట్‌ను విడుదల చేసింది.  ''రసోడ్ మెయిన్ అబ్ కుకర్ ఖలీ నహీ రహెగా (వంటగదిలో ఇప్పుడు కుక్కర్‌ ఖాళీగా ఉండదు) ! అని. ఎందుకంటే మమత బెనర్జీ జూన్‌ 2021 వరకు ఉచితంగా రేషన్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని 10కోట్ల మంది పేదవారికి దీని వలన లబ్ధి చేకూరుతుందని తెలిపారు. 


ఈ విషయం గురించి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ,  ‘లాక్‌డౌన్‌ విధించిన మూడు నెలల పాటు మేం ప్రతి కుటుంబానికి ఐదు కిలోలు ఉచిత బియ్యం అందించాం. సెప్టెంబర్‌ వరకు ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యంతో పాటు సమాన మొత్తంలో పిండిని కూడా అందిస్తాం.  జూన్ 2021 వరకు మేము ఉచిత రేషన్ అందిస్తాం’ అని మమతా అన్నారు.  'సాథ్ నిభానా సాథియా' లోని 'ప్రెజర్ కుక్కర్' సీన్‌ ఆధారంగా ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ యశ్రాజ్ ముఖతే ఈ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం 'రసోడ్ మే ఖాళీ కుక్కర్' ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఈ వీడియో మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ  మీమ్స్‌ రూపొందిస్తున్నారు. 

చదవండి: ‘అది నా మనస్సాక్షికి విరుద్ధం’

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు