అర్థరాత్రి ఆకాశంలో వింత కాంతి.. ఆందోళనలో జనాలు

23 Jun, 2021 09:49 IST|Sakshi

యూఎఫ్‌ఓలుగా అనుమానించిన జనాలు

శాటిలైట్‌లు అని తేల్చి చెప్పిన నిపుణులు

గాంధీనగర్‌: గుజరాత్ జునాగఢ్‌లో రాత్రి, ఆకాశంలో మెరుస్తున్న ప్రకాశవంతమైన లైట్ల వరుసలు జనాలను భయభ్రాంతులకు గురి చేశాయి. జనాలు వీటిని యూఎఫ్‌ఓలు అని అనుమానించి.. తీవ్రంగా కంగారు పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిలో, సుమారు నాలుగు నుంచి ఏడు ప్రకాశవంతమైన మెరిసే లైట్లు ఒకదాని వెంట లైన్‌గా పయనించడం గమనించవచ్చు. 

ఈ సందర్భంగా గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (గుజ్‌కోస్ట్‌) సలహాదారు నరోత్తం సాహూ మాట్లాడుతూ.. ‘‘అసహజమైన కాంతి దృశ్యాలను జనాలు యూఎఫ్‌ఓలుగా భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు.. ఇవి శాటిలైట్‌లు. భూమికి తక్కువ ఎత్తులో పయనించే ఈ శాటిలైట్‌లు ఇలా కనిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేశాయి తప్పి ఇవి యూఎఫ్‌ఓలు కాదు’’ అన్నారు.

"సౌరాష్ట్ర ప్రాంతంలో జనాలు జూన్‌ 22 తెల్లవారుజామన ఆకాశంలో అనుమానాస్పద రీతిలో 30-40 కాంతి పుంజాలు సరళ రేఖలో పయనించడం గమనించారు. జనాల్లో గూడు కట్టుకున్న సందేహాలు, మూఢనమ్మకాల వల్ల వీటిని యూఎఫ్‌ఓలుగా భావించారు. అయితే, అంతరిక్ష శాస్త్రం ప్రకారం, ఇటువంటి కాంతి మూడు సందర్భాలలో కనిపిస్తుంది. ఒక ఉల్కకు సంబంధించిన చిన్న భాగం భూమి ఉపరితలంలోకి ప్రవేశించినప్పుడు ఇలా కాంతి కనిపిస్తుంది. దీన్ని షూటింగ్ స్టార్’’ అంటారు అని గుజ్కోస్ట్ సలహాదారు సాహు తెలిపారు.

"కానీ, ఇక్కడ కనిపించిన ఈ ప్రత్యేక దృశ్యంలో ఎక్కువ లైట్లు కనిపించాయి. దీనికి కారణం భూమికి తక్కువ ఎత్తు కక్ష్యలో పయనించే ఉపగ్రహాలు అయి ఉంటాయి. ప్రస్తుతం భూమి దిగువ కక్ష్యలో 3000 కి పైగా ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి" అని తెలిపారు. ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ రాకెట్‌ను ప్రయోగించినప్పుడు అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఇలా లైట్లు కనిపించాయని సాహూ తెలిపారు. ఈ లైట్లు కచ్చితంగా ఉపగ్రహాలే. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. 

చదవండి: అమెరికన్‌ యుద్ధ నౌకను చుట్టుముట్టిన యూఎఫ్‌ఓలు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు