ఫన్నీ వీడియో: వీడెవ‌డ్రా బాబు.. అచ్చం నాలాగే ఉన్నాడు!

16 Oct, 2021 18:52 IST|Sakshi

రోజుకొకసారి అయిన అద్దం ముందు నిల్చొని తమ అందాన్ని తనివితీరా చూసుకుంటూ మురిసిపోయేవారు చాలా మంది ఉన్నారు. ఒకసారి ముఖం పాడవుతుందని, మరోసారి తమ కంటే ఇంకెవరూ అందంగా లేరనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. ఇలా మీరూ ఖచ్చితంగా ప్రయత్నించే ఉంటారు కదూ.. ఇప్పుడిదంతా ఎందుకంటే... ఓ కోతి బైక్‌ అద్దంలో తనను తాను పరీక్షించుకుంటూ కెమెరా కంటికి చిక్కింది. 
చదవండి: రైల్వే స్టేషన్‌లో యువతి హుషారైన స్టెప్పులు.. అందరూ చూస్తుండగానే!

బైక్‌ మీద కూర్చొని ఒక చేతితో బైక్‌ హ్యండిల్‌ పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటుంది. అద్దం వైపు చూసి అందులో తన ప్రతిబింబం కనిపించడంతో షాక్‌ అవుతోంది. ఒక్కసారిగా మరో కోతి తన ఎదురుగా ఉందని భావించి కంగారు పడుతుంది. అనుమానంతో మరోసారి అద్థంలో చూసుకోగా మళ్లీ అలాగే కనిపించడంతో కోపంతో అద్దం మీద కొడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

A post shared by Sachin Sharma (@helicopter_yatra_)

చదవండి: ఫ్రెండ్స్‌తో కలిసి స్టెప్పులేసిన వధువు.. వావ్‌ వాట్‌ ఏ డ్యాన్స్‌ అంటున్న నెటిజన్స్‌!

మరిన్ని వార్తలు