మారువేషంలో దొంగగా వచ్చి అత్తను చితకబాదిన కోడలు.. కానీ..!

31 May, 2023 18:54 IST|Sakshi

తమిళనాడులో అమానవీయ ఘటన జరిగింది. మారువేశంలో దొంగగా వచ్చిన కోడలు అత్తను చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన అత్త ప్రాణాలు కోల్పోయింది. తిరునల్వేలి జిల్లాలోని వడుకనపట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. 

గ్రామంలో శణ్ముగవేలు భార్య సీతారామలక్ష్మి (57). వారికి కుమారుడు రామస్వామి, కోడలు మహాలక్ష‍్మి ఉన్నారు. ఇంట్లో అత్తాకోడళ్లు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో పరిస్థితిని మెరుగుపరచడానికి రామస్వామి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మకాం మార‍్చినా.. ప‍్రయోజనం లేకపోయింది.

ఇటీవల జరిగిన గొడవ అనంతరం అత్తపై కక్ష పెంచుకున‍్న మహాలక్ష‍్మి పథకం వేసింది. మగవారి వేశం వేసి హల్మెట్ పెట్టుకుని అత్త నిద్రిస్తున్న సమయంలో ఆమెపై దాడి చేసింది. అత్త నుంచి బంగారం గొలుసు లాక్కెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అత్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయింది. అయితే.. కేసు నమోదు చేసిన పోలీసులకు సీసీటీవీ అధారాలతో అసలు విషయం బయటపడింది. కోడలే ఈ ఘటనకు కారకురాలని తేల్చారు. 

చదవండి:కంపెనీ డబ్బుతో డ్రైవర్ పరార్... ఓనర్ ఏం చేశాడంటే...

మరిన్ని వార్తలు