Asaduddin Owaisi On Hijab: హిజాబ్‌ తీర్పుపై ఒవైసీ స్పందన ఇది..

15 Mar, 2022 15:02 IST|Sakshi

హిజాబ్‌ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టేసి మరీ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కర్ణాటక హైకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా స్పందన కనిపిస్తోంది. ఈ తరుణంలో.. హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ కోర్టు తీర్పుపై స్పందించారు. తీర్పుపై నిరసన వ్యక్తం చేస్తూ పదిహేను పాయింట్లతో ట్విటర్‌లో ఒవైసీ సుదీర్ఘమైన సందేశం ఉంచారు.

తీర్పు.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా ఉంది. మతపరమైన స్వేచ్ఛ, సంస్కృతి, భావ ప్రకటన, రాజ్యాంగం అందించిన ఆర్టికల్‌ 15 లాంటి వాటిని ఉల్లంఘించినట్లే అవుతుంది. ముస్లిం మహిళల మీద ఈ తీర్పు ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. వాళ్లు లక్ష్యంగా మారుతారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదు. హిజాబ్ వేసుకుంటే ఏంటి సమస్య? అని ఒవైసీ స్పందించారు.
 
తీర్పు వెలువడిన వెంటనే ట్విటర్‌లోనూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నేను ఏకీభవించను. తీర్పుతో విభేదించడం నా హక్కు. పిటిషనర్లు సుప్రీం కోర్టు ముందు అప్పీల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను, మతం, సంస్కృతి, స్వేచ్ఛపై ప్రాథమిక హక్కులను నిలిపివేసినందున @AIMPLB_Official మాత్రమే కాకుండా ఇతర మత సమూహాల సంస్థలు కూడా ఈ తీర్పును అప్పీలు చేయాలని ఆశిస్తున్నాను అంటూ వరుస పోస్టులు చేశారు.

మరిన్ని వార్తలు