విద్యారంగం.. శిఖరాగ్రం | Sakshi
Sakshi News home page

విద్యారంగం.. శిఖరాగ్రం

Published Tue, Dec 26 2023 1:04 AM

భీమవరం మండలం వెంపలో నాడు–నేడులో అభివృద్ధి చేసిన పాఠశాల   - Sakshi

సాక్షి, భీమవరం : జిల్లాలో 1,075 ప్రాథమిక, 86 ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలల్లో మొత్తంగా 1,13,584 మంది విద్యార్థులు చ దువుకుంటున్నారు. ఈ ఏడాదిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల కు సంబంధించి అమ్మఒడి పథకం కింద 1,43,534 మంది తల్లుల ఖాతాలకు రూ.21.05 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు.

కార్పొరేట్‌ స్థాయిలో..

మనబడి–నాడు నేడు పథకంలో ప్రభుత్వం పాఠశాలలు, హాస్టళ్లు, జూనియర్‌ కళాశాలలు, రెసిడెన్షియ ల్స్‌ పాఠశాలలు, మండల వనరుల కేంద్రాలు, భవి త కేంద్రాలను అభివృద్ధి చేస్తోంది. జిల్లాలో రెండో విడతగా ఈ ఏడాది రూ.109 కోట్లతో 633 పాఠశా లలను అభివృద్ధి చేస్తున్నారు. అదనపు తరగతి గ దులు, టాయిలెట్స్‌, ప్రహరీలు, రక్షిత నీరు, డైనింగ్‌ హాళ్లు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నారు.

అమ్మచేతి ‘గోరుముద్ద’లా..

విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకం ద్వారా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రోజుకో మెనూ అమలుచేస్తున్నారు. దీంతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 80 శాతానికి పైగా విద్యార్థులు భోజనాన్ని తీసుకుంటున్నారు. జిల్లాలో సుమారు 90 వేల మంది మద్యాహ్న భోజనం తింటుండగా ప్రభుత్వం నెలకు రూ.4 కోట్లు వెచ్చిస్తోంది.

విద్యాకానుక.. ప్రగతి వీచిక

పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్‌ను తగ్గించి స్థూల నమోదు నిష్పత్తిని మెరుగుపర్చడం, అభ్యాసన కార్యకలాపాల్లో విద్యార్థుల భాగస్వామ్యాన్ని మెరుగుపర్చేందుకు రెండేళ్లుగా ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభంలోనే జగనన్న విద్యా కానుక (జేవీఎస్‌) కిట్లను అందజేస్తోంది. ఈ ఏడాది జిల్లాలో 1,13,584 మంది విద్యార్థులకు రూ.26.12 కోట్ల విలువైన జేవీఎస్‌ కిట్లను పంపిణీ చేశారు. ఒక్కో కిట్టులో మూడు జతల యూనిఫామ్స్‌, నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, జత షూ, రెండు జతల సాక్స్‌లు, స్కూల్‌ బ్యాగ్‌, ప్రాథమిక, మాథ్యమిక విద్యార్థులకు అదనంగా డిక్షనరీలు అందించారు.

జగనన్న ‘దీవెన’లు

ఆర్థికపరమైన ఇబ్బందులతో పేద విద్యార్థులు మధ్యలో ఉన్నత చదువులు ఆపకుండా జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఈ ఏడాది జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకం కింద బీసీ, ఈబీసీ, కాపు సామాజికవర్గాలకు చెందిన 37,123 మందికి రూ.96.03 కోట్లు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన 5,704 మందికి రూ. 5.78 కోట్లు అందజేసింది. వసతి దీవెన పథకం కింద బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థులు 36,699 మందికి రూ.35.14 కోట్లు, ఎస్సీ విద్యార్థులు 5,558 మందికి రూ.3.74 కోట్లు అందజేసింది. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద ఆరుగురు విద్యార్థులకు 1.25 కోట్ల సాయాన్ని ప్రభుత్వం అందజేసింది.

డిజిటల్‌ తరగతులు

దృశ్య, శ్రవణ విద్య ద్వారా విద్యార్థుల అభ్యసన సా మర్థ్యం మెరుగుపడుతుందన్న ఉద్దేశంతో ఎనిమిదో తరగతి నుంచి డిజిటల్‌ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్స్‌, స్మార్ట్‌ టీవీలు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ను 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందిస్తున్నా రు. ఈ ఏడాది 13,790 మంది విద్యార్థులకు ట్యా బ్‌లు అందజేయాల్సి ఉండగా తొలివిడతగా 5,590 మందికి పంపిణీ చేశారు. వారం రోజుల్లో మిగిలిన వారికి అందించనున్నారు. డిజిటల్‌ విద్యలో భాగంగా 191 ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్‌ టీవీలు, ఇతర సామగ్రిని అందజేస్తున్నారు.

ఫలితం ‘పది’లం కావాలని..

జిల్లాలో గత విద్యాసంవత్సరంలో 20,268 విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా 13,362 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 65.93 శాతంగా ఉంది. సప్లిమెంటరీకి 8,717 మంది హాజరుకాగా 4,156 మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన వారిలో కొందరిని రీ అడ్మిట్‌ చేసుకోవడం, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించేందుకు వి ద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 21,341 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అధికారులు, ఉపాధ్యా యులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

విద్య

ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పేద పిల్లల భవితకు బంగారు బాటలు వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. పేదలకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టారు. అమ్మఒడి, నాడునేడు, విద్యాకానుక, వసతి దీవెన, విద్యా దీవెన, డిజిటల్‌ విద్య, గోరుముద్ద తదితర కార్యక్రమాల ద్వారా అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో విద్యాసంస్కరణలతో అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు పోటీపడేలా చర్యలు తీసుకున్నారు. 2023లో విద్యారంగాన్ని శిఖరాగ్రానికి చేర్చారు.

చదువుల విప్లవం

పేదల విద్యకు ప్రాధాన్యం

1.43 లక్షల మందికి అమ్మఒడి

నాడు–నేడులో సుందరంగా పాఠశాలలు

కార్పొరేట్‌ స్థాయిలో వసతులు

డిజిటల్‌ తరగతులతో విద్యాభివృద్ధి

అమ్మఒడి

1,43,534 మందికి రూ.21.05 కోట్లు

నాడు–నేడు

633 పాఠశాలలకు రూ.109 కోట్లు

జగనన్న విద్యాకానుక

1,13,584 మంది.. రూ.26.12 కోట్లు

ట్యాబ్‌లు : 13,790

డిజిటల్‌ విద్య : 191 పాఠశాలలు

కుళాయిల వద్ద చేతులు శుభ్రం చేసుకుంటూ.. (ఫైల్‌)
1/3

కుళాయిల వద్ద చేతులు శుభ్రం చేసుకుంటూ.. (ఫైల్‌)

తరగతి గదిలో విద్యార్థినులు (ఫైల్‌)
2/3

తరగతి గదిలో విద్యార్థినులు (ఫైల్‌)

3/3

Advertisement
Advertisement