రామారావు పార్టీ మారితే నేను మారతానా? 

22 Nov, 2022 09:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ మారుతున్నానని ప్రచారం జరిగిన ప్రతిసారీ తాను ఖండిస్తూ వివరణ ఇచ్చుకోవాల్సి రావడం బాధాకరంగా ఉందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ మారాల్సిన అవసరం లేదని, ఏదైనా సమస్య ఉంటే హైకమాండ్‌తో మాట్లాడి పరిష్కరించుకునే చనువు, అవకాశం తనకున్నాయని అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడు రామారావు పార్టీ మారితే నాపై కూడా అదే ప్రచారం చేయడం సమంజసంగా లేదు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామారావుకు సీనియర్‌ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యే హరిప్రియకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇప్పించారు. అయినా వారిద్దరూ పార్టీ మారారు. అలా అని జానారెడ్డి, రేవంత్‌రెడ్డి కూడా పార్టీ మారుతారని అనుమానిస్తారా?’అని ఏలేటి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పారీ్టలోకి ఎల్లో, పింక్, ఆరెంజ్‌ పారీ్టల నుంచి వచి్చనవారు ఉన్నారని, వారిలో ఎవరు తనపై కుట్రలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్నవారికి పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పారీ్టనేనని, పార్టీ అంతర్గత విషయాల గురించి బహిరంగంగా మాట్లాడబోనని ఏలేటి స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు