‘గ్రేటర్‌’ ఎన్నికలు; కాంగ్రెస్‌ తొలి జాబితా ఇదే

18 Nov, 2020 18:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. 29 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ప్రకటించింది. మరో 15 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితా ఇవాళ రాత్రికి విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే వామపక్ష పార్టీలు తాము పోటీ చేయబోయే స్థానాల్లో పలువురు అభ్యర్థులను ప్రకటించాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఈరోజే అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. (తొలి జాబితా విడుదల చేసిన వామపక్షాలు)

1 కాప్రా పత్తి కుమార్
2 ఏఎస్‌రావునగర్ శిరీష రెడ్డి
3 ఉప్పల్ ఎం.రజిత
4 నాగోల్ ఎం.శైలజ
5 మున్సూరాబాద్ జక్కడి ప్రభాకర్
6 ఆర్కేపురం పున్న గణేష్
7 హయత్‌నగర్ గుర్రం శ్రీనివాస్‌ రెడ్డి
8 హస్తినపురం సంగీత నాయక్
9 గడ్డిఅన్నారం వెంకటేష్ యాదవ్
10 సులేమాన్‌నగర్ రిజవన బేగం
11 మైలార్‌దేవ్‌పల్లి శ్రీనివాస్ రెడ్డి
12 రాజేంద్రనగర్ బత్తుల దివ్య
13  అత్తాపూర్ వాసవి భాస్కర్‌గౌడ్
14 కొండాపూర్ మహిపాల్ యాదవ్
15 మియాపూర్ షరీఫ్
16 అల్లాపూర్ కౌసర్ బేగం
17 బేగంపేట్ మంజుల రెడ్డి
18 మూసాపేట్ జి.రాఘవేంద్ర
19 ఓల్డ్ బోయినపల్లి అమూల్య
20 బాలానగర్ సత్యం శ్రీ రంగం
21  కూకట్‌పల్లి తేజశ్వర్ రావు
22  గాజులరామారం శ్రీనివాస్ గౌడ్
23 రంగారెడ్డి నగర్ గిరగి శేఖర్
24  సూరారం బి.వెంకటేష్
25 జీడిమెట్ల బండి లలిత
26 నెరేడ్‌మెట్ మరియమ్మ
27 మౌలాలి ఉమామహేశ్వరి
28 మల్కాజ్‌గిరి శ్రీనివాస్ గౌడ్
29 గౌతంనగర్ టి.యాదవ్‌

మరిన్ని వార్తలు